వరుస వివాదాలు అనసూయకి అడ్డంకిగా మారాయా? కొత్త ఆఫర్లు ఇక కష్టమేనా?

బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. అయితే ఆమెని అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో వున్నారని ఇటీవల జరిగిన వివాదాలవలనే తెలుస్తోంది. ఇకపోతే తాజాగా లైగర్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు పెట్టుకుని అనసూయ లైగర్ సినిమాను టార్గెట్ చేశారు. అయితే అదే సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి.

ఇక నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు అనసూయ సమాధానమిస్తున్నా ఆమెపై నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే వివాదాల వల్ల అనసూయ కెరీర్ కు నష్టమే తప్ప లాభం అయితే ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనసూయ జబర్దస్త్ షోకు దూరమయ్యారు. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లే జబర్దస్త్ షోకు దూరమయ్యానని అనసూయ చెబుతున్నారు. అయితే అనసూయను తమ సినిమాలలోకి తీసుకోవడం వల్ల సినిమాలు కూడా వివాదాలలో చిక్కుకునే ఛాన్స్ అయితే ఉందని దర్శకనిర్మాతలు భావించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి కెరీర్ పరంగా ముందు దూసుకుపోతున్న అనసూయ వివాదాల వల్ల ఇండస్ట్రీకే దూరమయ్యే పరిస్థితి వస్తుందా అనే అనుమానం రేకెత్తుతోంది. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు వేర్వేరు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచి ఇండస్ట్రీకి దూరమైన ఘటనలు మనం చూసాం. అనసూయ నెగిటివ్ వార్తల ద్వారా వార్తల్లో నిలవడం ఫ్యాన్స్ కు సైతం నచ్చడం లేదు. అభిమానులకోసమైనా అనసూయ ఈ విషయంలో మారాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

Share post:

Latest