యాంకర్ ప్రదీప్ పారితోషకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

అటు వెండి తెర పై ఇటు బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న యాంకర్లలో ప్రదీప్ కూడా ఒకరు. నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రదీప్. ఇక 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం వరుసగా షోలు చేసుకుంటూ బుల్లితెరపై యాంకర్ గా సుమా తర్వాత అత్యధిక ఆదరణ పొందిన ప్రదీప్.. ఒక్కొక్క ఎపిసోడ్ కి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది.Anchor Pradeep to get hitched soonప్రస్తుతం ప్రదీప్ చేస్తున్న షోలలో ఒక్కొక్క ఎపిసోడ్ కి ఏకంగా 5 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటారు అని సమాచారం. ఇకపోతే ఒక్క కాల్ షీట్ కోసం ఐదు లక్షల రూపాయలు అంటే ప్రదీప్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమాలలో నటిస్తున్న చిన్న హీరోలకు సైతం ఆ స్థాయిలో పారితోషకం ఉండే అవకాశం లేదని చెప్పవచ్చు. కానీ యాంకర్ గానే ప్రదీప్ ఇలా ఒక కాల్ షీట్ కోసం ఐదు లక్షల తీసుకుంటున్నాడు అంటే ఇక హీరో రేంజ్ అని చెప్పడంలో సందేహం లేదు. సుధీర్ అలాగే ఆది కూడా ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం లేదు అని సమాచారం.Pradeep embroiled in another controversy: Anchor slips his mouth .. Leaders  give warning live - The Post Reader

ఇకపోతే ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ తన తదుపరి సినిమాకు సంబంధించిన చర్చ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఆచితూచి కథల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రదీప్ కథ బాగా ఉండి.. నచ్చితేనే సినిమా చేస్తాను అంటూ దర్శక నిర్మాతలకు కూడా ముందే కండిషన్లు పెడుతున్నాడు. ఇకపోతే హీరోగా కూడా ఈయన పారితోషకం రోజువారిగానే తీసుకుంటారు అని సమాచారం. ఇక అలా తీసుకుంటే కోటి రూపాయల పైనే ఈయన పారితోషకం అవుతుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest