వామ్మో.. శోభన్ బాబు ఆస్తి అన్ని వేల కోట్లా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. శోభన్ బాబు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆయన అందంతోనే ఎంతోమంది ఆడవారిని ఆకర్షితులను చేయడమే కాకుండా ఆంధ్ర సోగ్గాడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన జుట్టుకు ఉండే రింగు ఆయనకు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చింది. ఇక ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే చాలా మంది శోభన్ బాబు రింగును ఉపయోగించుకొని మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇక ఈయన తెలుగులో కేవలం హీరో పాత్రలు మాత్రమే చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు దూరంగా ఉండిపోయారు.Here's the shocking truth behind actor Sobhan Babu and late Tamil Nadu CM  Jayalalitha's affair

ఇకపోతే సినిమాల ద్వారా సంపాదించడమే కాకుండా అతిపెద్ద బిజినెస్ మాన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శోభన్ బాబు. ఈయన దగ్గర ఉన్న డబ్బు ప్రస్తుతం ఏ ఒక్కరి దగ్గర లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ప్రముఖ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన దగ్గర ఉన్న ఆస్తి కనుక లెక్క వేస్తే ప్రస్తుతం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని మురళీమోహన్ వెల్లడించారు. శోభన్ బాబు అతిపెద్ద బిజినెస్ కావడంతో చాలా ప్రదేశాలలో కొన్ని వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారట.Shoban Babu Real Photos In His House - YouTube

ఇక శోభన్ బాబు మరణించే సమయానికి సుమారుగా ఆయన దగ్గర రూ.85 వేల కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం. ముఖ్యంగా 1976లో కొన్ని మేజర్ కంపెనీలలో షేర్లు కూడా తీసుకున్నారట. చెన్నై శివారులలో ఆయనకు సంబంధించి కొన్ని వేల ఎకరాల స్థలాలు ఉన్నాయి అని మురళీమోహన్ వెల్లడించారు. ఇక శోభన్ బాబు ఆస్తుల గురించి తెలియజేయాలి అంటే ఆయన కాలక్షేపం కోసం తన ఎస్టేట్ ను చూడడానికి ఉదయం బయలుదేరితే తిరిగి రావడానికి సాయంత్రం అయ్యేదట. ఇక దీన్ని బట్టి చూస్తే ఆయన ఆస్తి విలువ ఎంతో మనం ఊహించవచ్చు. ఇక ప్రస్తుతం అవన్నీ లెక్కలు వేస్తే ఇప్పుడున్న మిలియనీర్ లాంటి వారు కూడా ఈయన ఆస్తి ముందు దిగదుడుపే అని చెప్పడంలో సందేహం లేదు.