అనసూయ స్థానంలో కొత్త యాంకర్.. ఎవరంటే..?

బుల్లితెర ప్రేక్షకులకు కూడా జబర్దస్త్ కామెడీ షో ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా 9 సంవత్సరాల నుండి జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఇప్పటివరకు జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నది. అన్ని షో లతో పోలిస్తే జబర్దస్త్ కామెడీ షోకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ప్రేక్షకులలో.. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఇలాంటి వాటితోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని పలు సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు కమెడియన్స్.

- Advertisement -

అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో పలు మార్పులు అనూహ్యంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ మొదలైన అప్పటినుంచి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఇటీవల జబర్దస్త్ నుంచి తప్పుకున్నది. అయితే వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక ఆ ప్రోమోలో జబర్దస్త్ న్యూ యాంకర్ అని ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది మల్లెమాల సంస్థ. అయితే ఆ యాంకర్ ఎవరన్న విషయాన్ని మాత్రం పూర్తిగా రివీల్ చేయలేదు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు చాలా సస్పెన్స్ గా ఫీలవుతున్నారు. ఈ కామెడీ షో ప్రసారమయ్యేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ క్రమంలో వచ్చే ఆదివారం ఎపిసోడ్లో హీరోయిన్ సంగీత జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక యాంకర్ ని మాత్రం ఒక పల్లకిలో తీసుకువచ్చి ముందుగా చేతులు, చెవులు, బుగ్గలు అది కూడా వెనుక భాగం నుంచి వాటిని చూపించారు. ఇక జబర్దస్త్ యాంకర్ కి కూడా హీరోయిన్ రేంజ్ లో ఎంట్రీ చూపించారు. దీంతో ఆ కొత్త యాంకర్ ఎవరన్నా ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతుంది. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ లో మాత్రం యాంకర్ రష్మీ కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది.

Share post:

Popular