సుకుమార్ పరిస్థితి ఏమిటి? ‘పుష్ప’ విషయంలో ఏం చేయబోతున్నాడు?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మాటల్లో చెప్పుకోలేం. ఓ మూస ధోరణితో సినిమాలు పోతున్నవేళ కాస్త వెరైటీ కధనంతో ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడు సుక్కు. ఓవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. అలాంటి సుకుమార్ నుండి గత కొన్ని నెలలుగా తన అప్ కమింగ్ సినిమాల విషయాలు గానీ మరియు తన ప్రొడక్షన్ లో రూపొందే చిత్రాలకు సంబంధించి కానీ ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ రాలేకపోవడం చూసి అభిమానులు ఒకింత బాధకు లోనవుతున్నారు.

పుష్ప సంగతి ఏమిటి?

ఈ నేపథ్యంలో పుష్ప సినిమా విషయమై కూడా ఎలాంటి అప్డేట్ రాకపోవడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తొలి చిత్రం అయినటువంటి ‘ఆర్య’ సినిమా తోనే మంచి సక్సెస్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు సుక్కు. ఇక అప్పటినుండి సుకుమార్ – బన్నీ కాంబో అంటే సినిమా ప్రేక్షకులలో ఒకింత ఆసక్తి నెలకొంది. దాని తరువాత వారి కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ కూడా అంతే రేపోతో ఆడి.. ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన పుష్ప పార్ట్ 1 సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

మిగతా సమాచారం?

‘పుష్ప 2’ సినిమా ఆగష్టు రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి కానీ.. దానిపై నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సైలెంట్ కి అర్ధం ఏమిటో తెలియక సుక్కు అభిమానులు ఒకపక్క, బన్నీ అభిమానులు ఒక పక్క జుట్టు పీక్కుంటున్నారు. మరి సుక్కూ రానున్న రోజుల్లో అయినా ఈ సినిమా అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి. పోనీ సదరు నిర్మాతలైనా ఈ విషయమై ఓ అప్డేట్ ఇస్తే బావుంటుందని ఆశిద్దాం.

Share post:

Latest