ఆ హీరోయిన్ అంటే భయమంటున్న కలెక్షన్ కింగ్.. కారణం..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఎందుకంటే ఆయన ఏ విషయంలో అయినా సరే చాలా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ప్రవర్తిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాలలో కూడా ఎప్పుడు చలాకిగా ఉండే మోహన్ బాబు విద్యాసంస్థలను కూడా ఏర్పాటు చేసి మరెన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీరి వారసులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది డబ్బున్న వారికే ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. పేదల ఆకలి తీర్చడంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఇంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇంకొకరికి భయపడడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇక ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా వెల్లడించడం గమనార్హం.PIX: Sridevi-Jaya Prada mingle with Mohan Babu - Rediff.com movies

మోహన్ బాబు ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్ లతో కలిసి నటించిన విషయం తెలిసిందే. కానీ వీరందరిలో కంటే ఆయన కూతురు అలాగే ప్రముఖ హీరోయిన్గా గతంలో గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి అంటే మోహన్ బాబుకు చాలా భయం అట.. ముఖ్యంగా తన కూతురు మంచు లక్ష్మి కి మోహన్ బాబు భయపడతారు అని సమాచారం. అంతేకాదు మంచు లక్ష్మి ప్రతి విషయంలో కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటుందని ,ఒక రాక్షసి లాగా భయపెడుతుంది అని తెలియజేశాడు మోహన్ బాబు .ఇకపోతే మంచు లక్ష్మి అంటే ఎంత భయమో అంతే ప్రేమ కూడా ఉంది అని మోహన్ బాబు తెలియజేయడం గమనార్హం.

ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా ఎవరికీ భయపడిన మోహన్ బాబు తన కూతురికే భయపడతాడా అంటూ కామెంట్లు చేయడంతో సర్వత్ర ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.