త్వరలో రష్మీ పెళ్లి అంటూ షాక్ ఇచ్చిన స్టార్ యాంకర్..!!

బుల్లితెరపై యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద హోస్ట్ గా ఎన్నో షోలకు వ్యవహరిస్తోంది. ఇక హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించినా ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. బుల్లితెరపై , వెండితెరపై గ్లామర్ రోల్ చేస్తూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక సుధీర్, రష్మీ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసినవారు ఎవరైనా సరే వీరిద్దరూ రియల్ లవర్స్ అనుకుంటూ ఉంటారు.Telugu actress Rashmi Gautam urges people to say no to animal rides,  captivity- The New Indian Expressతొమ్మిదేళ్లుగా వీరిద్దరు లవ్ ట్రాక్ నడుపుతున్నారని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక వీరిద్దరికీ ఈటీవీలో పలు షో లలో ఎన్నోసార్లు వివాహం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఒక ప్రోమో విడుదలవ్వడం జరిగింది .ఈ ప్రోమోలో రష్మీ గౌతమ్ తన పెళ్లికి సంబంధించి ఒక ప్రకటన చేసింది వచ్చే ఆదివారం రాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ ప్రోమో అక్క బావ ఎక్కడ అని ఎపిసోడ్ తో విడుదల చేయడం జరుగుతుంది. తన పెళ్లి గురించి ప్రకటన చేయడంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇన్ని రోజులు మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నేను సమాధానం చెప్పబోతున్నాను.. నాకు వివాహం కుదిరింది అంటూ రష్మీ తెగ సిగ్గుపడుతూ చెబుతోంది. అయితే రష్మీ పెళ్లి అనే విషయం కేవలం ఎపిసోడ్ కోసము చేసిన ప్రోమోన లేకుంటే నిజమా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ యూట్యూబ్ వీడియో కింద నేటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మల్లెమాలను శ్రీదేవి డ్రామా కంపెనీను తెగ తిట్టేస్తున్నారు.దీంతో రష్మీ పెళ్లి అనగానే ఎవరు కూడా నమ్మడం లేదు. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి రష్మీ నిజంగానే వివాహం చేసుకోబోతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే..

Share post:

Latest