షాకింగ్: మహేష్ బాబు సినిమాలో నటించనని తేల్చి చెప్పిన సీనియర్ హీరో ఇతనే!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల అందగాడండి. చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? అని అనుకుంటున్నారా?

అతడే అందరి అందాల నటుడు శోభన్ బాబు. ఇక ఇది జరిగింది ఇప్పుడు కాదనే విషయం మీరు గ్రహించేసే వుంటారు కదా. నిజమే… ఓ నిర్మాత బ్లాంక్ చెక్ ఇచ్చి కావలసినంత రెమ్యూనరేషన్ రాసుకోమన్నా ససేమిరా అన్నారట. మహేష్ బాబు లాంటి స్టార్ తో శోభన్ బాబు మూవీ చేయను అని చెప్పడానికి బలమైన కారణం ఉంది. అదే సమయంలో జనరేషన్ గ్యాప్ తో ఆయన సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన గౌరవంగా పరిశ్రమకు సెలవు ప్రకటించారు.

అదే సమయంలో ‘అతడు’ మూవీలో మహేష్ తాతయ్య పాత్ర కోసం శోభన్ బాబును సంప్రదించగా చేయనని నిర్మొహమాటం చెప్పాడట. ఆ నిర్ణయం కరక్టే అని ఇపుడు అర్ధం అయిందా? కాగా ఈ సినిమాకి నటుడు మురళీమోహన్ నిర్మాత. కథలో హీరో తాత గురించి విన్నాక ఇది శోభన్ బాబు గారితో చేయిస్తే బాగుంటుందని మురళీమోహన్ భావించారట. దాంతో మురళీమోహన్ ఓ బ్లాంక్ చెక్ పై సైన్ చేసి ఓ వ్యక్తికి ఇచ్చి చెన్నైలో నివాసం ఉంటున్న శోభన్ బాబు వద్దకు పంపారట. అయితే మురళీమోహన్ ఆఫర్ ని శోభన్ బాబు సున్నితంగా తిరస్కరించారట.