సోషల్ మీడియాలో సైలెంట్‌గా సమంత.. అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్‌ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా పుష్పలోని ‘ఊ అంటావా మామ’ స్పెషల్ సాంగ్ చేసి, అందరి దృష్టినీ ఆమె తన వైపు తిప్పుకుంది. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌లోని రాజీ పాత్రతో తనలోని నటనా సామర్థ్యాలను దేశమంతటా తెలియజేసింది. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియాలో సైలంట్‌గా ఉండడం ఆమె అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.

సమంత నిత్యం తాను చేసే ఎన్నో పనులు, అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ ఖాతాల ద్వారా అభిమానులతో నిత్యం ముచ్చటిస్తుంటారు. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియా ఉనికి లేకుండా పోయింది. ఆమె చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రెండు వారాల క్రితం, ట్విట్టర్‌లో ఆమె చివరిసారిగా జూలై 2న కరణ్ జోహార్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. అప్పటి నుండి సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలపై కూడా జీరో యాక్టివిటీతో పూర్తిగా సైలెంట్‌గా మారింది. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ అంశంపై ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కొంతమంది అభిమానులు సమంతా సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉందని భావిస్తున్నారు.


మరోవైపు, ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదని, స్ట్రగుల్‌లో ఉందని కొందరు భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె సోషల్ మీడియా ఫాలోయర్లలో ఎవరితోనూ కమ్యూనికేట్ చేసే మూడ్‌లో లేదని కూడా కొందరు అనుకుంటున్నారు. ఇలా పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి సమంతానే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest