Liger Trailer: పిచ్చెక్కించేసిందిరా అబ్బాయిలు… రౌడీ కిక్ సూప‌ర్ ( వీడియో)

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాధ్ స్టయిల్ అంటూ ఒకటి వుంది. హీరో ఎవర‌న్న దాంతో సంబంధం లేకుండా పూరి క‌థ‌కు అనుగుణంగా త‌న స్టైల్లోకి మార్చేసుకుంటాడు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ ఆద్యంతం అదిరిపోయేలా ఉంది.

ట్రైల‌ర్ అంతా ప‌క్కా పూరి స్టైల్లో ఉంది. ఫుల్లీ ఫ్యాక్డ్‌గా క‌ట్ చేశారు. రిపీట్ సీన్స్ అయితే లేవు. ట్రైల‌ర్లో విజ‌య్ లైఫ్ అంతా ప‌క్కా ఫైట‌ర్ లైఫ్‌గా చూపించారు. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా భారీగానే ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఎక్కువుగా యాక్ష‌న్ సీన్లే ఉన్నాయి. మధ్యలో పూరి స్టయిల్ అమ్మగా రమ్యకృష్ణ కనిపించారు.

హీరోయిన్ తో హీరో రొమాన్స్ సీన్లు, మైక్ టైసన్ పార్ట్ ఇంట్రస్టింగ్ గా ఉండ‌డంతో పాటు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇక విజువ‌ల్స్ అయితే చాలా రీచ్‌గా ఉన్నాయి. లైగర్ గా విజయ్ ఫుల్ మాసీగా, మాన్లీగా కనిపించాడు. లైగర్ క్యారెక్టర్ కు కొద్దిగా నత్తి వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ట్రయిలర్‌లో కూడా అదే చూపించారు.

నేప‌థ్య సంగీతం బాగుంది. తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పక్కన పెడితే నటుడుగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేలా కనిపిస్తున్నాడు. సినిమాపై అంచ‌నాల‌ను ట్రైల‌ర్ ఒక్క‌సారిగా పెంచేసింది.