బిగ్ షాకింగ్: ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా లీక్..ఆ పొలిటీషియన్ కి రవితేజ స్ట్రైట్ వార్నింగ్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా కూడా చెడు ఎక్కువుగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా సినీ రంగం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సినీ ప్రమోషన్స్ కి వచ్చిన ప్లస్ పాయింట్స్ కంటే..సినిమా గురించి నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం..సినిమా రిలీజ్ కంటే ముందే..మూవీ కి సంబంధించిన పిక్స్, వీడియోస్, సీన్స్ ని లీక్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. అసలే కరోనా తెచ్చిన పెట్టిన నష్టలతో ఇండస్ట్రీ సతమతమవుతుంటే..ఇప్పుడు ఈ లీకుల గోల ఎక్కువైపోయింది.

ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో లీకై .. ఫైనాన్షీయల్ గా దెబ్బతిన్నాయి. ఇప్పుడు రవితేజ కి కూడా అదే పరిస్ధితి రాబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే రవితేజ కెరీర్ కి ప్రజెంట్ ఒక్క హిట్ కూడా పడట్లేదు . దీంతో చాలా కసి గా పట్టుదలతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేశాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. శరత్ మండవ దర్శకత్వం సినిమాకి ప్లస్ కానుందని రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తేనే అర్ధమైపోతుంది. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ అందాలు. ఈ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటించింది.

అయితే, మరికొద్ది గంటల్లో సినిమాకి సంబంధించిన ప్రీమియర్లు పడనున్నాయి. ఓ వైపు రవి తేజ ఫ్యాన్స్ ధియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈసారి సినిమా హిట్ అవుతుందని..మళ్ళీ రవితేజ ఫాంలోకి వస్తున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సడెన్ గా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకి సంబంధించిన ఓ సీన్ నెట్టింట లీకైంది. అది ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీన్ గా తెలుస్తుంది.

ఈ సీన్ లో రవితేజ చెప్పే డైలాగ్..పరోక్షంగా ఓ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రామారావు ఆన్ డ్యూటీ చిత్ర టీం వెంటనే రంగంలోకి దిగి.. లీకైన ఫుటేజ్ ని డిలీట్ చేయాలి అభిమానులు కోరుకుంటున్నారు. లేకుంటే అవి మరింతగా సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యే ఛాన్స్ ఉందని..దాని ద్వార సినిమా కలెక్షన్స్ దెబ్బతింటాయని అభిమానులు అంటున్నారు.