పిల్లలు కనడం గురించి సద్గురు సలహాలు తీసుకున్న ఉపాసన.. ఆయన ఆన్సర్ వింటే మైండ్ బ్లాకే ..!!

సోషల్ మీడియాలో ఎవర్ ట్రెండింగ్ న్యూస్ లల్లో మెగా వారసుడు న్యూస్ కూడా ఒకటి. మెగా కొడలు ఉపాసన గుడ్ న్యూస్ చెప్పితే వినాలి అనేది కోట్లాది మంది అభిమానుల కోరిక. మనకు తెలిసిందే..సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఒక్కడే కొడుకు..అది రామ్ చరణ్ నే. ఆయన్ కి వారసుడు పుడితే..సినీ ఇండస్ట్రీలో అసలైన మెగా వారసుడు ఉంటాడు.

నాగబాబు, పవన్ కల్యణ్ కొడుకులకి ఇంకా చాలా టైం ఉంది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై పడ్డాయి. పోనీ, ఈ కుర్రాడికి పెళ్ళై రెండు , మూడేళ్ళు అయ్యిందా అంటే అదీ కాదు..పెళ్ళై పదేళ్ళు కంప్లీట్ అయ్యింది. ఈ మధ్యనే పెళ్ళి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ మెగా జంట. పెళ్ళై పదేళ్లు గడుస్తున్నా ..ఇంకా గుడ్ న్యూస్ చెప్పకపోవడం పై చాలా మందిలో అనేక రకాల డౌట్లు ఉన్నాయి.

కాగా, ఇప్పుడు మెగా వారసుడి పై సద్గురు చేసిన కామెంట్స్ నెట్టింట వివాదస్పందంగా మారాయి. రీసెంట్ మెగా కోడలు ఉపాసన ..ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. అయితే, ఎవ్వరు ఊహించని విధంగా ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురుని ..తన మాతృత్వంపై ప్రశ్నలు అడిగి మెగా అభిమానులకు షాక్ ఇచ్చింది. సద్గురుతో ఉపాసన మాట్లాడుతూ..”ఇప్పుడు అందరు నా RRR గురించి మాట్లాడుకుంటున్నారు. రిలేషన్ (R) రీ ప్రొడ్యూస్ (R) రోల్ ఇన్ లైఫ్ (R) అంటూ ఉపాసన సద్గురు ముందు తన పిల్లల గురించి అడిగారు. అయితే దీనిపై సద్గురు ఎవ్వరు ఊహించని విధంగా ఆన్సర్ ఇస్తూ..”జీవితంలో రిలేషన్ షిప్ అనేది నీ పర్సనల్.. దాని గురించి నేను మాట్లాడను..మాట్లాడకూడదు. ఇక నీ పిల్లలు విషయానికి వస్తే.. నువ్వు ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలను కనకూడదు అని నిర్ణయించుకుంటే దానికి నేను ఖచ్చితంగా అభినందిస్తా. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 1000 కోట్లు దగ్గర గా ఉంది.సమాజం అంతరించిపోతున్న జీవులం అయితే కాదు కదా… అదే నువ్వు అంతరించిపోతున్న జాతివి అయితే, ఖచ్చితంగా పిల్లలిని కను అనే చెప్పుతా..”అంటూ చెప్పుకొచ్చారు.

Share post:

Latest