రామ్ గోపాల్ వర్మ “లడ్కి” : అమ్మాయిలే కాదు ..అబ్బాయిలు కూడా చూడలేని సినిమా..!!

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా..వాళ్లందరిలోకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేరు. అందరి డైరెక్టర్స్ జనాల కోసం కధను రాసుకుని సినిమాను తెరకెక్కిస్తే.. వర్మ మాత్రం తాను అనుకున్న కధని..నిర్మోహమాటంగా..పచ్చిగా చెప్పాలంటే సిగ్గులేకుండా తీస్తారు అంటారు కొందరు జనాలు. ప్రజెంట్ RGV సినిమాలు చూస్తే..గతంలో మనం చూసిన నాగార్జున శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ని తెరకెక్కించింది ఈయనేనా..అనే డౌట్లు వస్తాయి..అలాంటి చీప్ కంటెంట్ ఉన్న స్టోరీలే తీస్తున్నాడు RGV.


అయితే ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం “లడ్కి”. మార్షల్ ఆర్ట్స్ కాన్ సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. దాదాపు 47 వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేసారు రామ్ గోపాల్ వర్మ. నిజానికి రామ్ గోపాల్ వర్మ తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకోరు అనే పేరుంది. కానీ, ఈ సినిమా కోసం ఆయన ఓ రేంజ్ ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమా కి సీరియస్ తీసుకున్నాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ, జనాలు మాత్రం RGV ని పిచ్చ లైట్ తీసుకున్నారు.

భారీ అంచనాల నడుమ నేడు ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది . అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా లో పూజా భలేకర్ అన్ని విధాల బాగా నటించిన జనాలను మాత్రం తన కధతో మెప్పించలేకపోయాడు RGV. స్టోరీ విషయానికి వస్తే .. పూజ .. బ్రూస్ లీకి వీరాభిమాని అంతేకాదు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి సిటీకి వస్తుంది. ఓ కోచ్ దగ్గర జాయిన్ అవుతుంది. అయితే అప్పటికే కోట్ల విలువైన అతని డెన్‌ని ఖాళీ చేయమని తీవ్ర ఒత్తిడిలో అంటాడు కోచ్. అతని దగ్గరే ఆమె శిక్షణ ప్రారంభిస్తుంది. ఊహించని విధంగా కోచ్‌ని చంపేస్తారు దుండగులు. ఆ టైంలో పూజా ఎలా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది.. ఆమె తాను అనుకున్న గమ్యానికి ఎలా చేరుతుంది అనేది సినిమా కథ.

ఈ చిత్రానికి రవి శంకర్, డి.ఎస్.ఆర్ సంగీతం అందించారు. ఇండో – చైనీస్ కోప్రొడక్షన్ లో సినిమా రూపొందింది. ఈ సినిమా కంటెంట్ కన్నా కూడా వల్గారిటీనే ఎక్కువ ఉంది అంటున్నారు సినిమా చూసిన జనాలు ..అది RGV సినిమా లో కామన్ అయిపోయింది. కానీ, ఈ టైప్ ఆఫ్ సినిమాలో కూడా అలాంటి సీన్స్ బాగోలేవు అంటున్నారు జనాలు.

అంత వల్గారిటీని అబ్బాయిలు కూడా చూసి తట్టుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమాలో చెప్పుకోతగ్గ పాయింట్స్ కూడా లేవని..సేమ్ రోటీన్ బోరింగ్ డ్రామా సినిమా అంటూ సినిమా కి 1 రేటింగ్ ఇవ్వడం కూడా దండగే అంటూ..పక్కకు తప్పుకుంటున్నారు. నెటిజన్స్ టాక్ ప్రకారం చూసుకుంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అని చెప్పక తప్పడం లేదు.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం..!!