TJ రివ్యూ & రేటింగ్ : పక్కా కమర్షియల్‌

టైటిల్‌ :పక్కా కమర్షియల్‌
నటీనటులు : గోపిచంద్‌, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్‌, తదితరులు
నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత: బ‌న్నీ వాసు
రచన,దర్శకత్వం: మారుతి
సంగీతం : జేక్స్ బిజాయ్
సినిమాటోగ్రఫీ: క‌ర‌మ్ చావ్లా
ఎడిటర్‌: ఎన్ పి ఉద్భ‌వ్
విడుదల తేది: జులై 1, 2022

విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. టీజర్‌, ట్రైలర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్‌ ఫార్మాట్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అయ్యిందా ? లేదా ? చూద్దాం.

స్టోరీ :
ఓ సిన్సియర్‌ న్యాయమూర్తి సూర్య నారాయణ (సత్య రాజ్‌). వ్యాపారవేత్త వివేక్‌ (రావు రమేశ్‌) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయ‌లేక‌పోయాన‌న్న బాధ‌తో త‌న వృత్తి వ‌దిలేసి కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. అత‌డి కొడుకు ల‌క్కీ (గోపిచంద్‌) కూడా లాయర్ అయినా తండ్రిలా నిజాయితీగా కాకుండా అక్ర‌మార్కుల‌కు కొమ్ముకాస్తుంటాడు. అత‌డి టార్గెట్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. ఈ క్ర‌మంలోనే వివేక్‌కు ద‌గ్గ‌ర‌వుతాడు. ఈ విష‌యం తెలుసుకున్న సూర్య‌నారాయ‌ణ కొడుక్కి వ్య‌తిరేకంగా మ‌ళ్లీ న‌ల్ల కోటు వేసుకుని కొడుకుకు వ్య‌తిరేకంగా వాదించ‌డానికి కోర్టు మెట్లు ఎక్కుతాడు. సొంత తండ్రిని కాదని వివేక్‌ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్‌గా ఎందుకు మారాడు ? హీరోయిన్ లాయ‌ర్ ఝాన్సీ పాత్ర ఏంట‌న్న‌దే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
మారుతి సినిమాల్లో చాలా వ‌ర‌కు ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటు సెంటిమెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. ఓ వైపు బ‌ల‌మైన క‌థ‌తో పాటు ఇటు కామెడీ, సెంటిమెంట్ కూడా ఉంటుంది. అయితే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్లో మాత్రం క‌థ‌ను ప‌క్క‌న ప‌డేసి కామెడీతో లాక్కొచ్చేశాడు. త‌న స్టైల్ కాదనుకుని గోపీచంద్ స్టైల్లో హీరోయిజం స్టైల్లో సినిమాను లాగేశాడు. లాయ‌ర్ ల‌క్కీగా గోపీచంద్ ఎంట్రీతోనే ఈ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా ఉండ‌బోతోంద‌ని అర్థ‌మైంది.

హీరోయిన్ అయిన రాశీఖ‌న్నా లాయర్‌ ఝాన్సీ ఎంట్రీతో కామెడీ డబుల్‌ అవుతుంది. ఫ‌స్టాఫ్ అంతా సినిమా కామెడీ సాగిపోతుంది. సెకండాఫ్ నుంచే అస‌లు క‌థ స్టార్ట్ అవుతుంది. విల‌న్ రావు ర‌మేష్‌కు ద‌గ్గ‌రైన గోపీచంద్ చివ‌ర‌కు అత‌డిని ఎలా జైలుపాలు చేసి త‌న తండ్రికి జ‌రిగిన అన్యాయంపై రివేంజ్ తీర్చుకున్నాడ‌న్న‌దే స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌గా గోపిచంద్‌ ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. సీరియల్‌ హీరోయిన్‌ లాయర్‌ ఝాన్సీగా రాశీఖన్నా ఇరగదీసింది. ఆమె డైలాగులు బాగున్నాయి. అందంగా క‌నిపించింది. లాయ‌ర్ గా, హీరో తండ్రిగా సత్యరాజ్‌ జీవించేశాడు. రావు రమేశ్‌ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్‌ వివేక్‌గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా చూస్తే జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. సాంగ్స్‌తో పాటు నేప‌థ్య సంగీతం అద‌ర‌గొట్టింది. పాట‌ల్లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ – అందాల రాశీ పాట‌లు బాగున్నాయి. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ష‌న్ ప‌రంగా మెరుపులు మెరిపించినా రచయితగా తన స్థాయికి ఔట్ పుట్ ఇవ్వలేదు. ప్రధాన పాత్రధారుల క్యారెక్టరైజేషన్లతోనే మార్కులు కొట్టేసే మారుతి.. ఈసారి ఆ విషయంలో తన బలాన్ని చూపించలేకపోయాడు.

ఫైన‌ల్‌గా…
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మారుతి మార్క్ కాసిన్ని నువ్వులు పూయించిందే త‌ప్పా కంప్లీట్ పైసా వ‌సూల్ సినిమా కాదు. అయితే గోపీచంద్ గ‌త సినిమాల‌తో పోలిస్తే కాస్త బెట‌ర్‌

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ రేటింగ్ : 2.5 / 5

Share post:

Latest