“పక్కా కమర్షియల్” హిట్టా..ఫట్టా..?

గత కొన్నేళ్లు గా సరైన హిట్ లేక బాధపడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ తన ఆశలన్ని ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. అప్పుడెప్పుడో “సీటిమార్” అంటూ సైలెంట్ హిట్ అందుకున్న ఈ హీరో కమ్ విలన్ కమ్ హీరో..కొద్ది గంటల క్రితమే పక్కా కమర్షియల్ అంటూ ధియేటర్స్ లోకి వచ్చాడు.

- Advertisement -

గోపీచంద్ తెర పై కనిపించకపోయినా..ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ అవ్వడం తో ఆ పబ్లిసిటీ కూడా ఉంది. దీంతో ఈ పక్కా కమర్షియల్ సినిమాపై బోలెడు అంచానాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే, వాటిని డైరెక్టర్ మారుతు రీచ్ కాలేకపోయాడు అని తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం “పక్కా కమర్షియల్”.

అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం నేడు ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. సినిమాలో గోపీచంద్ యాక్టింగ్..రాశీ ఖన్నా అందాలు బాగున్నా..కధలో కీ పాయింట్ మిస్ అయ్యాడు డైరెక్టర్ అంటూ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు..గోపీ చంద్ ని నటన పరంగా..కామెడీ టైం పరంగా మారుతీ వాడుకోలేకపోయాడు అని అంటున్నారు జనాలు. మ్యూజిక్ అయితే వర్స్ట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అంత తీసిపడేసే సినిమా కాదు.. వన్ టైం చూడచ్చు అంతే.. బిలో యావరేజ్ అనే టాక్ ఇస్తున్నారు. సో, ఆడియన్స్ టాక్ ప్రకారం చూసుకుంటే.. పక్కా కమర్షియల్ ఫట్టే అని చెప్పక తప్పదు.

Share post:

Popular