‘పక్కా కమర్షియల్‌’ కి ఫస్ట్‌డే ఊహించని కలెక్షన్స్‌.. ఎంతంటే..!!

గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన లెటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గత కొంత కాలంగా సరైన హిట్ పడని గోపీచంద్ తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుని ఉన్నాడు. అల్లు అరవింద్ ఈ సినిమా ను ప్రోడ్యూస్ చేయడం ..సినిమాకి మంచి పబ్లిసిటీ ఇవ్వడంతో సినిమా పై ఓ రేంజ్ లో ఊహించుకున్నారు జనాలు,

- Advertisement -

సీన్ కట్ చేస్తే.. మారుతి మార్క్ సినిమాలో మిస్ అయ్యింది. దీంతో సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే, పక్కా కమర్షియల్‌ ఫస్ట్ డే కలెక్షన్స్ తాలుకా లెక్కలను అఫిషీయల్ ప్రకటించి GA2 పిక్స్చర్స్. తొలి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ మరో షాకింగ్ ఏమిటంటే..గోపీచంద్ కెరీర్ లో ఇప్పటి వరకు ఇంత బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించలేదు.

గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకున్నా ఈ స్దాయి కలెక్షన్స్ రాబట్టడం గొప్పే అంటున్నారు సినీ విశ్లేషకులు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వీకెండ్స్ లో ఇంకా ఎక్కువ స్దాయి కలెక్షన్స్ అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి గోపీ చంద్ కెరీర్ కు ఈ సినిమా ఎలా ప్లస్ అవుతుందో..?

Share post:

Popular