ఆ NTR హీరోయిన్ కనబడుటలేదేమి? ఆమె కెరియర్ ఆగిపోవడానికి కారణం ఇదేనా?

జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్ల అందరి జీవితాలు బావున్నాయి. ఆ ఒక్క హీరోయిన్ జీవితం తప్ప. ఇక అదెవరనేదేగా మీ సందేహం. ఆమెయే షీలా కౌర్. అవును… ఆమె మీకు గుర్తుందా. అదేనండి అదుర్స్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ ఈవిడే. ఆమె తెలుగు , తమిళ్, కన్నడ ,మలయాళం భాషలలో నటించి, మెప్పించింది. తెలుగులో చేసింది కేవలం 4 సినిమాలే కానీ ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. మొదటగా తీసిన సీతాకోకచిలుక ఆ తరువాత రాజు భాయ్, దాని తరువాత అల్లు అర్జున్ తో పరుగు… ఇలా పెద్ద పెద్ద హీరోల సరసన నటించింది.

ఆమెకి అవకాశాలు రాకపోవడానికి కారణం ఇదేనా?

ఎన్టీఆర్ తో నటించిన అదుర్స్ సినిమాతో షీలా కున్న క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ఆ తరువాత షీలా కి మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆ అవకాశాలను ఒప్పుకోనివ్వలేదని అప్పట్లో సమాచారం వచ్చింది. చాలాకాలం ఆ నిర్మాత సినిమాలకు దూరంగా ఉంచాడని, సినిమాల్లో చేస్తే వచ్చే రెమ్యునరేషన్ ఏమిచేయకుండానే ఇస్తానని సదరు నిర్మాత అన్నాడట. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని షీలా నిజంగానే అదుర్స్ సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. ఆ తర్వాత చాలా ఏళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యింది.

ఆ నిర్మాత ఇతడేనా?

తరువాత కాలంలో సదురు నిర్మాతతో ఆమె సన్నిహితంగా మెలిగిందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది. కారణం ఏదైనా షీలా కౌర్ మంచి స్టేటస్ ను కోల్పోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత షీలా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. మరి ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు గాని, ఆ నిర్మాత మాత్రం టాలీవుడ్ లో ఇప్పుడున్న ప్రముఖ నిర్మాతలలో ఒకరని తెలిసింది. చూడడానికి అచ్చు తెలుగమ్మాయిలా కనిపించే తను టాలీవుడ్ యంగ్ హీరోలకి మంచి జోడి అయుండేది. కానీ ఆ అమ్మడు అందరితో నటించే అవకాశాలను కోల్పోవడం దురదృష్టకరం.