షాక్ ఐపీల్ కు సుస్మితసేన్ కొత్త ప్రియుడికి లింక్ ఇదే..!

ఇది ఓ రకంగా మాజీ విశ్వసుందరి సుష్మితాసేన్ అభిమానులకు షాకింగ్ ఇచ్చే విషయం అని చెప్పుకోవాలి. అవును, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఈసారి ఏకంగా మాజీ IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్‌ అయినటువంటి లలిత్‌ కుమార్ మోదీతో ప్రేమాయణం నెరుపుతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోదీ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అధికారికంగా ప్రకటించడం విశేషం. తామిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, ప్రస్తుతం డేటింగ్‌లోనే ఉన్నామని లలిత్‌ మోదీ చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబందించిన రొమాంటిక్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది తెలిసిన వెంటనే అందరికీ వారి వయస్సు విషయంలో కొన్ని సందేహాలు రావచ్చు. ప్రస్తుతం వారి మధ్య సుమారు 10 సంవత్సరాల పైనే వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదేమి వింత అని సోషల్ మీడియాలో వారి గురించి చర్చ నడుస్తోంది. డబ్బుంటే ఏమైనా జరుగుతుంది అని ఎవరికీ వారు సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఇకపోతే సుస్మితా సేన్‌తో కలిసి దిగిన ఫొటోస్ పోస్ట్ చేసిన లలిత్ మోదీ.. ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేస్తున్నారు. ‘కుటుంబాలతో కలిసి తిరుగుతున్న గ్లోబల్ టూర్ ఇది. మాల్దీవుల్స్, సార్డినియాలో షికార్లు కొట్టాక లండన్‌కు తిరిగి వచ్చాను. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రునిపై తేలుతున్నట్లు ఉంది’ అని లలిత్ మోదీ ఓ ట్వీట్ చేయడం కొసమెరుపు.

ఆ వెంటనే వేరొక ట్వీట్ చేస్తూ.. జనాలకి ఓ క్లారిటీ ఇచ్చాడు. అదేమిటంటే… ‘జస్ట్ క్లారిటీ కోసం.. ప్రస్తుతానికి మేమిద్దరం డేటింగ్‌లోనే ఉన్నాం. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది’ అని పేర్కోవడం ఒకింత విడ్డురం అని చెప్పుకోవాలి. ఇక వారి ఆస్తుల విషయానికొస్తే, వారికి కొదువేం లేదు. ఓ బడా బిజినెస్ మెన్ యెంత సంపాదిస్తాడో లలిత్ అంత సంపాదిస్తున్నాడు. ఇక సినిమాలనుండి ప్రస్తుతం దూరంగా ఉంటున్న సుష్మిత, అతనికి దగ్గరవ్వడం పట్ల కొన్ని విమర్శలు వస్తున్నాయి. గతంలో కొన్ని బంధాలు నెరిపిన సుష్మితకు ఈ బంధం అయినా చివరి వరకు ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.