అమీర్ ఖాన్ ను కోర్టుకి ఈడ్చిన నాగార్జున హీరోయిన్.. కారణం..?

గీతాంజలి.. మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో గిరిజా పాత్రకు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా అన్నీ కూడా టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడంతో ఈమె క్రేజ్ తారా స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు . గిరిజ ఓకే చెప్తే చాలు ఎంత పారితోషకం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని దర్శకనిర్మాత లు కూడా లైన్లో నిలబడ్డ సందర్భాలు అప్పట్లో చాలానే చూసాము. కానీ ఈమె మాత్రం పాత్ర, కథ అన్ని తెలుసుకొన్న తర్వాతనే తనకు నచ్చితేనే ఆ సినిమాలలో నటించేది.Gitanjali Movie Cuts-07 - Nagarjuna Akkineni, Girija Shettar, Vijayakumar, Vijayachander - HD - video Dailymotionముఖ్యంగా తన మనసుకు నచ్చిన పాత్రలకు అలాగే ప్రేక్షకులను మెప్పించగలిగే పాత్రలకు మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. ఇకపోతే ఈమె తల్లి బ్రిటిష్ చెందిన వారైతే తండ్రి ఇండియన్.. కానీ ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డ వీరి ఫ్యామిలీ చాలా రిచ్ అవ్వడంతో గిరిజ సినిమాను ఫ్యాషన్ కోసం మాత్రమే చేసింది. ఇక ఈ క్రమంలోనే పలు డిఫరెంట్ క్యారెక్టర్ లో ఉండే పాత్రలకు ఓకే చెబుతూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక అలా డిఫరెంట్ గా క్యారెక్టర్ లను ఎంచుకునే గిరిజ.. ఆనందతాండవం అనే డిఫరెంట్ సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమా ఊహించని స్థాయిలో బోల్తా కొట్టడం గమనార్హం. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన జో జీతా వహీ సిఖిందర్ సినిమాలో కూడా నటించింది.Did you know: Before Ayesha Jhulka, this actress had shot as the female lead for 'Jo Jeeta Wohi Sikandar' | Hindi Movie News - Times of Indiaఈ సినిమా వల్లే అమిర్ ఖాన్ తో గొడవ జరిగిందని సమాచారం. అసలు విషయంలోకి వెళితే.. స్క్రిప్ట్ లో లేని వాలీబాల్ గ్లామరస్ సీన్ లో నటించాలని దర్శకులు అలాగే హీరో.. గిరిజకు చెప్పారట. ఇక గిరిజ నో చెప్పడంతో ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ఆమె రిజెక్ట్ చేసి కోర్టు మెట్లు ఎక్కింది .ఇక కోర్టు కూడా గిరిజకు నష్టపరిహారం అందించాలని ఆదేశించిందట. తర్వాత ఆమెకు నష్టపరిహారం చెల్లించి మరొక హీరోయిన్ ను పెట్టి సినిమా పూర్తి చేశారు. ఇక అలా అమీర్ ఖాన్ కూడా కోర్టుకు వెళ్లడంతో ఈ విషయం కాస్త అప్పట్లో సంచలనం సృష్టించింది.