హీరో వెంకటేష్ కూతురు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరో. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్యలతో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఎమోషన్స్, కామెడీ.. ఇలా యాక్టింగ్ లో ఏ సన్నివేశానాన్నై వెంకటేష్ రక్తికట్టించగలరు. ఇప్పటికీ హీరోగా ఇంకా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు.

అయితే హీరో వెంకటేష్ సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖాళీ సమయాల్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా గడుపుతూ ఉంటారు. అయితే వెంకటేష్ కూతురు ఆశ్రిత ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. తండ్రి సినిమాల్లో పాపులర్ అయితే కూతురు ఆశ్రిత ఫుడ్ వ్లాగర్ గా రాణిస్తోంది. తెలుగువారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్పినిటీ ప్లాటర్ పేరిట అకౌంట్ ఓపెన్ చేసిన ఆశ్రిత.. అందులో ఫుడ్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంది.

అలాగే యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసిన ఫుడ్ వీడియోలు పెడుతుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను హోపర్ డాట్ కామ్ విడుదల చేసింది. ఇందులో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377వ ర్యాంక్ లో ఉంది. ఇక ఆసియాలో 27వ ర్యాంకులో ఉంది. ఇక బ్రాండ్ కొలాబరేషన్స్ తో కోట్లలో సంపాదిస్తుంది.

ఆశ్రితకు ఫుడ్ మీద బాగా ఆసక్తి ఉండేది. తండ్రి వెంకటేష్, పెదనాన్న సురేష్ బాబు విదేశాలకు వెళ్లి వచ్చినప్పుడు ఫుడ్ విషయాల గురించి ఎక్కువగా తెలుసుకునేదట. ఫుడ్ ఎలా ఉంటుంది. వెరైటీల గురించి అడిగి తెలుసుకుంటుందట. ఇప్పటికీ కూడా అలాగే చేస్తుందట. ఏది ఏమైనా తండ్రికి తగ్గ కూతురుగా ఆశ్రిత పేరు సంపాదించుకుంటోంది.