స్టార్ హీరోయిన్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్.. కారణం..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఈయన అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో దేశం గర్వించదగ్గ నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విదేశాలలో కూడా ఈయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఇక ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సూపర్ హిట్ మూవీ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన సినిమాలలో నటించే ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఒకానొక సమయంలో ఒక స్టార్ హీరోయిన్ ను ఆయన ఇబ్బంది పెట్టినట్టు.. అందుకే ఆమెకు సారీ చెప్పినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ తన కెరియర్లో సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో సింహాద్రి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ డాన్స్ వేశారు. ఈ సినిమాకు ఈ పాటే చాలా హైలెట్ అని చెప్పవచ్చు.

కీరవాణి మ్యూజిక్ అందించగా చిన్నదమ్మే చీకులు కావాలా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. కానీ ఈ పాటలో డాన్స్ చేసే సమయంలో రమ్యకృష్ణను ముట్టుకోకుండా డాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారట ఎన్టీఆర్. అంతేకాదు తనవల్ల రమ్యకృష్ణ ఇబ్బంది పడ్డారేమో అని తెలుసుకున్న తారక్ వెళ్లి ఆమెకు సారీ చెప్పగా రమ్యకృష్ణ మాత్రం నువ్వేమి నన్ను ఇబ్బంది పెట్టలేదు.. నీ స్టెప్పులు చూస్తూ నేను కూడా బాగా డాన్స్ చేసానని చెప్పారని సమాచారం. ఇక వీళ్ళిద్దరూ నా అల్లుడు సినిమాలో కూడా అత్త అల్లుళ్ళుగా నటించిన విషయం తెలిసిందే.