విజయనగరంలో ఇద్దరికీ డౌటే?

విజయనగరం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నట్లు ఉండేది…2019 వరకు ఇక్కడ టీడీపీ మంచి ఫలితాలే రాబట్టింది…కానీ 2019లోనే ఊహించని విధంగా ఓటమి పాలైంది…జిల్లాలో ఉన్న 9 సీట్లలో టీడీపీ చిత్తుగా ఓడింది..అలాగే ఉన్న ఒక్క ఎంపీ సీటుని సైతం కోల్పోయింది. ఇలా విజయనగరం జిల్లాలో వైసీపీ విజయం అందుకుంది. అయితే ఇదంతా 2019 ఎన్నికల్లో జరిగిన సీన్..కానీ నిదానంగా అక్కడ సీన్ మారుతూ వస్తుంది. వైసీపీ ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు…టీడీపీ బలం పుంజుకోవడం కావొచ్చు..విజయనగరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఇదే క్రమంలో అశోక గజపతి రాజు ఫ్యామిలీ అడ్డాగా ఉన్న విజయనగరం అసెంబ్లీలో, పార్లమెంట్ స్థానంలో కూడా వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. అసలు విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుకు తిరుగేలేదు..1978 నుంచి వరుసపెట్టి గెలుస్తూ వస్తున్నారు…2004లోనే ఆయన ఓటమి పాలయ్యారు…మళ్ళీ 2009లో గెలిచారు…2014లో విజయనగరం ఎంపీగా గెలిచారు. అలాగే అసెంబ్లీలో టీడీపీ గెలిచింది.

కానీ 2019 లో గజపతి ఫ్యామిలీకి పెద్ద షాక్ తగిలింది…విజయనగరం అసెంబ్లీలో పోటీ చేసిన అశోక్ కుమార్తె అతిథి….పార్లమెంట్ లో పోటీ చేసిన అశోక్ గజపతి ఓడిపోయారు. అసెంబ్లీలో కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంట్ స్థానంలో బెల్లాల చంద్రశేఖర్ గెలిచారు. అయితే ఈ మూడేళ్లలో ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని సత్తా చాటలేకపోయారని తెలుస్తోంది…ప్రజల మద్ధతు పెద్దగా పొందలేకపోయారు. అసలు చంద్రశేఖర్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేక వస్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ లో చంద్రశేఖర్ మళ్ళీ నిలబడితే గెలుపు అవకాశాలు ఉండవని తెలుస్తోంది.

అటు అసెంబ్లీలో కోలగట్ల పనితీరుకు మంచి మార్కులు ఏమి పడటం లేదు. పైగా అశోక్ కుమార్తె అతిథి పుంజుకుంటున్నారు. నెక్స్ట్ వైసీపీకి అనుకూలంగా ఏమన్నా పరిస్తితులు మారితే తప్ప..విజయనగరంలో కోలగట్ల, చంద్రశేఖర్ గెలవడానికి ఛాన్స్ ఉంటుందని, లేదంటే రెండు సీట్లు వైసీపీ కోల్పోవాల్సిందే అని తెలుస్తోంది.

Share post:

Latest