ఎప్పటికీ హీరో వి కాలేవంటూ సూపర్ స్టార్ కృష్ణ ను అవమానించింది వారేనా..కారణం..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జేమ్స్ బాండ్, కౌబాయ్ వంటి చిత్రాలతో పాటు ఈస్ట్ మన్ కలర్ ను తెలుగు పరిచయం చేసిన ఘనత కేవలం కృష్ణ గారికి మాత్రమే దక్కుతుంది. ఏది చేసినా వినూత్నంగా ఉండాలని ఆలోచించే అతి కొద్ది మందిలో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఈయన సినీ ఇండస్ట్రీకి ప్రవేశపెట్టిన ప్రతిదీ కూడా సరికొత్త రంగులను తీర్చిదిద్దడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో ఒక అద్భుతాన్ని సృష్టించి ఇవ్వగలిగాడు. ఇక వివాదాలకు, గొడవలకు ఎప్పుడూ దూరంగా ఉండే కృష్ణ రకరకాల పాత్రలతో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించాడు.

అయితే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణను ఎప్పటికీ హీరోవి కాలేవు అంటూ ఘోరంగా అవమానించారట. ఇక అసలు విషయంలోకి వెళితే ఒకానొక సమయంలో ఏకంగా 12 సినిమాలను తెరకెక్కించారట సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఆ సినిమాలలో కనీసం ఒక్క సినిమా కూడా ఆవరేజ్ గా ఆడక పోవడంతో అటు సినీ ఇండస్ట్రీలో ఉన్న పలువురు ప్రముఖులు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పటికీ హీరోవి కాలేవంటూ సూపర్ స్టార్ కృష్ణ ను చాలా ఘోరంగా అవమానించారట. ఇక ఈ అవమానాన్ని భరించలేక సూపర్ స్టార్ కృష్ణ పట్టుదలతో బడిపంతులు అనే సినిమాను తెరకెక్కించారు . ఇక ఈ సినిమాతో మళ్లీ ఓవర్ నైట్ లోనే తన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోగలిగారు కృష్ణ.

ఇక ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఎన్నో రికార్డులను కూడా తిరగరాసాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెరకు పరిచయం చేసిన మరో సరికొత్త టెక్నాలజీ 70MM మూవీ.. ఫస్ట్ సినిమా స్కోప్ ని కూడా టాలీవుడ్ కి పరిచయం చేసింది కృష్ణనే. ఇకపోతే పద్మాలయా స్టూడియోను నిర్మించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇకపోతే ఈయన నటించిన గూడచారి 116 సినిమాకు కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకున్నారట. ఇక అభిమానుల కోసం తన కూతురు హీరోయిన్ అవ్వాలన్న కలను కూడా మొగ్గలోనే తుంచేసానని కృష్ణ తెలిపారు.