“మీకు దండం పెడతా”..భర్త మరణం పై ఫస్ట్ టైం స్పందించిన మీనా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కోలీవుడ్ హీరోయిన్ మీనా..ప్రస్తుత్త పరిస్ధితి ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. తన ప్రాణానికి ప్రాణమైన భర్తను కోల్పోయి చాలా బాధపడుతుంది. మనకు తెలిసిందే రెండు రోజుల ముందు మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణం చేత హాస్పిటిల్ లో అడ్మిట్ అయ్యి..అక్కడే తుది శ్వాస విడిచారు.

అతి చిన్న వయసుల్లోనే మీనా భర్త మరణించడం పై ఇండస్ట్రీ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేశారు. కోలీవుడ్ స్టార్ లెజండరీ హీరో..రజనీకాంత్ అయితే, స్వయాన మీనా ఇంటికి వెళ్లి ఆమెను పలకరించారు. ఇక మీనా తన భర్త అంత్యక్రియలు చేసిన దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ముక్కలైలా ఉన్నాయి. ఆమె బాధ ఎవ్వరు ఓదార్చలేనిది.

కాగా, మీనా భర్త విద్యా సాగర్ మరణం పై మీడియాలో రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. కొందరు అయితే, మరీ దారుణంగా భర్త మరణానికి కారణం మీనానే అంటూ వార్తలు రసుకొచ్చారు. ఇలాంటి వార్తలు పై మీనా స్పందిస్తూ..”భర్తను పోగొట్టుకున్న బాధలో ఉన్నాను. దయచేసి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయకండి. మా కుటుంబ ప్రైవసీ కి భంగం కలిగించకండి.. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మీనా.

Share post:

Latest