ఊ.. అన్నా.. ఉఊ అంటున్నార‌ట‌.. ఆ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే బాధ చూశారా…!

వైసీపీలో ఎమ్మెల్యేల ప‌రిస్తితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. సీమ జిల్లాల ప‌రిస్థి తిని తీసుకుంటే.. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌వ‌క‌ర్గం నుంచి గెలిచిన యువ నాయ‌కురాలు.. ఉన్న‌త విద్యావంతురాలు.. జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి ప‌రిస్థితి చిత్రంగా మారింద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. నిజానికి వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డంలో ప‌ద్మావ‌తి ముందున్నారు. పైగా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పేవారు కూడా ఎవ‌రూ లేరు.

ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాదిరిగా ఎమ్మెల్యేతో ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అయిన‌ప్ప‌టికీ.. ఆమెకు ప‌రిస్థితి ఇబ్బందిగానే మారింద‌ని అంటున్నారు పరిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి లేద ని.. త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని.. చాలా మంది ఆమెకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిపై సానుకూ లంగానే స్పందిస్తున్న ఎమ్మెల్యే వ‌చ్చేలా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయినా కూడా ఆమెకు ఇప్పుడు మైలేజీ రావ‌డం లేదు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నేది ఎమ్మెల్యేకు త‌ల‌నొప్పిగా మారింది.

కింది స్థాయిలో నాయ‌కులు కొంద‌రు.. ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వ‌ల్లే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఇబ్బందులు వ‌స్తున్నాయ‌నేది ప్ర‌ధానంగా ఉన్న విమ‌ర్శ‌. అయితే..వారు ఎవ‌రు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ఎమ్మెల్యేగా ప‌ద్మావ‌తి దూకుడుగా ఉంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఎంపీ స‌హా.. ఇత‌ర నాయ‌కుల‌తోనూ ఆమెకు వివాదాలు లేవు. అయిన‌ప్ప‌టికీ.. ఆమెకు సెగ‌మాత్రం త‌గులుతోంది.

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చినా గెలవ‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న వారిలో త‌న పేరు కూడా ఉండ‌డం చూసి..ఆమె ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌ట్టు వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. అయితే.. ఆమె మాత్రం ఖండిస్తున్నారు. తాను ప్ర‌జ‌ల‌కు మంచే చేస్తున్నాన‌ని, క‌రోనా స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా ఆదుకున్నాన‌ని.. అలాంట‌ప్పుడు తానెందు ఓడిపోతాననేది.. ఆమె మాట‌. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆమెకు వ్య‌తిరేక‌త చాప‌కింద నీరులా ఉంద‌ని అధిష్టానం వ‌ర‌కు అందిన స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.