బింబిసారా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్ .. కళ్యాణ్ రామ్ లుక్స్ అద్దిరిపోయాయి అంతే..(వీడియో)..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాల హిట్స్ లేకపోయినా..తీసిన ప్రతి సినిమాలో తన నటనతో అభిమానులను మెప్పిస్తూ.. సినిమా సినిమాకి కొత్త స్టైల్ యాడ్ చేస్తూ.. స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. కాగా, ఇప్పటి వరకు లవ్, ఎమోషన్, రొమాంటిక్ సినిమాలో నటించిన ఈయన..ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ లోకి వెళ్తూ..”బింబిసారా” అనే సినిమాను చేస్తున్నాడు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కమర్షియల్ కథలకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న చిత్రాలనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. ఆ విషయం మనకు తెలిసిందే. కానీ ఈసారి పాన్ ఇండియా లెవెల్‌లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో ముందుకొస్తున్నారు. రాజ్యాలు, రాజులతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రస్తుత కాలానికి సంబంధించి ఉండేలా ఓ అద్భుతమైన కథతో బింబిసార అంటూ రాబోతున్నాడు. చిత్రానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ August 5 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బింబిసారా నుండి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈశ్వరుడే.. ఈశ్వరుడే అంటూ సాగే ఈ పాటలో కళ్యాణ్ రామ్ లుక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ పాటలో కనిపిస్తున్న ఆయన యాక్షన్ లుక్స్ సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేసేలా ..అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ ఇండియన్ సినిమా చరిత్రను తిరగ రాస్తాడు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share post:

Latest