అర్ధరాత్రి దాటినా నిద్రరావట్లేదా? ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి..గ్యారింటీగా గాఢ నిద్ర పడుతుంది..!!

ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నామా..? అంటే కాదు కాదు సోషల్ మీడియా యుగంలో ఉన్నాము అని చెప్పాల్సిన పరిస్ధితులు దాపురించాయి మనకు. ప్రజెంట్ జనరేషన్ నే కాదు.. ముసలి వాళ్లు కూడా పెరుగుతున్న టెక్నాలజీకి అలవాటు పడిపోయి..నైట్ టైం ఫోన్ చూడనిదే నిద్ర పట్టేలా లేదు అన్నస్దాయికి వచ్చేశారు జనాలు.

మనిషికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఖచ్చితంగా ఓ మనిషి కి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. కానీ, ఈ రోజుల్లో జనాభా కి అంత టైం లేకుండా పోయింది. కొందరు చదువులతో బిజీ అయితే, మరికొందరు ఉద్యోగాలతో బిజీ..మరికొందరు ఫ్యామిలీ టెన్షన్స్..ఇలా రీజన్ ఏదైన కానివ్వండి..దాని ఎఫెక్ట్ నిద్ర పై పడుతుంది .

మనిషికి నిద్ర లేకపోతే.. కొత్త జబ్బులు కాలింగ్ బెల్ కొట్టకుండానే మన ఒంటిలోకి ప్రవేశిస్తాయి. మనిషి సరైన టైంలో సరిగ్గ కంటినిండా నిద్ర పోకపోతే..బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వదు ..ఆ రోజు అంతా ఏదో తెలియని మైకంలో..లేజీ గా ఉంటుంది. ఏ పని చేసుకో బుద్ది కాదు. అలా అర్ధరాత్రి దాటినా నిద్ర రాని వారు ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు..ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

ఎలాంటి వారైన సరే..బెడ్ రూమ్ లోకి వచ్చాక..మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఎలాక్ట్రానిక్ గాడ్జెట్స్ దూరంగా పెట్టండి. అస్సలు మీ దగ్గరలో ఉంచుకోకండి. మరీ ముఖ్యంగా..మీ మనసుని ఏ టెన్షన్ల వైపు, ప్రాబ్లమ్‌స్ వైపు మళ్లించకండి. మీ భార్య/భర్త తో హ్యాపీ గా ఉన్న మూమెంట్స్ మాట్లాడుకోండి..సరదాగా నవ్వుకోండి..పిల్లలు ఉన్న వాళ్ళు ..కిడ్స్ తో మాట్లాడుతూ పనుకోండి. వాళ్ళు డైలీ ఏం చేశారో..కబుర్లు చెప్పుతూ ఉంటే.. మన మనసు హాయిగా ఉంటుంది. స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు..కిడ్స్ తో మాట్లాడటం..కన్నా మించిన రిలీఫ్ ఏమి ఉండదు . ఈ టిప్ ఒక్కసారి ఫాలో అయ్యి ట్రై చేయండి..రిజల్ట్ మీకే అర్ధమౌతుంది.