ఈ నందమూరి హీరో సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా..?

ఇటీవల కాలంలో చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వారిలో నందమూరి హీరో నారా రోహిత్ కూడా ఒకరు. ఈరోజు నారా రోహిత్ బర్తడే కాగా హీరోగా సినిమా అవకాశాలు లేక గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు ఒక నాలుగు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన షూటింగ్స్ తాలూకు అప్డేట్లు కూడా ఏవీ రావట్లేదు. ఇక తన స్నేహితుడు శ్రీ విష్ణు సినిమా ఫంక్షన్స్ లో మాత్రమే దర్శనమిస్తున్న నారా రోహిత్ బరువు తగ్గి చాలా స్లిమ్ లుక్ లోకి వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడని గత ఏడాది వరకు బాగా ప్రచారం జరిగినా.. ఆయన బరువులో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు నారా రోహిత్ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కూడా ఎక్కడా లేవు.Nara Rohit Talks About His New Body Transformation Midst The Quarantine

ఇక ఈ క్రమంలోనే నారా రోహిత్ నటించిన జో అచ్యుతానంద, సోలో , అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలతో తన ప్రత్యేకతను చాటిన ఈయన.. ఆ తర్వాత సినిమాలకు ఎందుకు బ్రేక్ ఇచ్చాడో తెలియడం లేదు. ఇకపోతే ఈరోజు నారా రోహిత్ పుట్టినరోజు కాబట్టి ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అందరూ ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు రోహిత్ సినిమాలకు సంబంధించిన ఎటువంటి షూటింగ్ విషయాలు బయటకు రాకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే నారా రోహిత్ నిజంగానే సినిమాలకు దూరమయ్యాడా లేక షూటింగ్స్ జరుగుతూ ఉండి బిజీగా ఉన్నాడా అనే విషయం ప్రేక్షకులకు అంతు చిక్కడం లేదు. ఇకపోతే నారా రోహిత్ కు బంధువులు, స్నేహితులు , పలువురు సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి.

Share post:

Latest