డైలాగ్ కింగ్‌-బాబు భేటీ.. కొత్త గేమ్ ఇదేనా…!

డైలాగ్‌కింగ్‌గా గుర్తింపు ఉన్న మోహ‌న్‌బాబు..తాజాగా టీడీపీఅధినేత చంద్ర‌బాబును క‌లిశారు. త‌న కుమార్తె తో క‌లిసి..హైద‌ర‌బాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో దాదాపు గంట‌న్న‌ర సేపు చ‌ర్చించారు. అయితే.. ఈ చ‌ర్చ‌లు..స‌డెన్‌గా.. బాబుతో భేటీ కావ‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముం దు.. వైసీపీకి అనుకూలంగా మోహ‌న్‌బాబు వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. గ‌త చంద్ర‌బాబు స‌ర్కారుపై ఆయ‌న నోరు చేసుకున్నారు.

 

తిరుప‌తిలోని త‌న శ్రీవిద్యా నికేత‌న్‌కు.. ఇవ్వాల్సిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని.. పేర్కొం టూ.. ఆయ‌న పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిపై కేసు కూడా న‌మోదైంది. ఇటీవ‌లే.. దీనిపై కోర్టు కూడా విచార‌ణ చేప‌ట్టింది. ఇక‌, ఎన్నిక‌ల్లో వైసీపీకి అనుకూలంగా ప‌లు జిల్లాల్లో ప్ర‌చారం చేశారు. త‌ర్వా త‌.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. త‌న‌కు ఏదైనా గుర్తింపు ల‌భిస్తుంద‌ని భావించారు. కానీ, జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు.

దీంతో అప్ప‌టి నుంచి వైసీపీ స‌ర్కారుపై గుస్సాగా ఉన్నారు. మ‌రోవైపు.. ఇటీవ‌ల బీజేపీపై ఆయ‌న సాను కూల డైలాగులు పేల్చారు. తాను కూడా బీజేపీ నాయ‌కుడినేన‌ని.. బీజేపీ నేత‌ల త‌ర‌ఫున తాను ప్ర‌చారం చేశాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్ర‌ధాని మోడీతోనూ.. మోహ‌న్‌బాబు భేటీ అయ్యారు. ఒక‌వైపు..వైసీపీ త‌ర‌ఫున ఉంటూనే.. మ‌రోవైపు.. బీజేపీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. దీంతో రాజ‌కీయాల్లో అప్ప‌ట్లోనే దీనిపై చ‌ర్చలు వ‌చ్చాయి.

Heritage Foods is mine, Naidu deceived me: Mohan Babu

ఇక‌, ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ బ‌ద్ధ శ‌త్రువు.. చంద్ర‌బాబుతో మోహ‌న్‌బాబు భేటీ అయ్యారు. విష‌యం ఏదైనా.. కూడా..ఆయ‌న భేటీకి చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఒక‌వైపు.. బీజేపీని పొగ‌డ‌డ్ం.. అదే బీజేపీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు కోసం.. టీడీపీ ప్ర‌య‌త్నిస్తుండ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో మోహ న్ బాబు చ‌ర్చ‌లు .. అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. పైగా.. వైసీపీపై మోహ‌న్‌బాబు ఇటీవ‌ల కాలంలో సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న టీడీపీ అధినేత‌కు చేరువ కావ‌డం.. రాజ‌కీ యంగా కీల‌కంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న టీడీపీ అనుకూలంగా మారినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.