దర్జా మూవీ.. ఎలా ఉందంటే..?

అనసూయ.. మరొకసారి దర్జా సినిమాతో ఏ పాత్రలోనైనా సరే నటించగలను అని ప్రూవ్ చేసుకుంది. సలీం మాలిక్ దర్శకత్వంలో సునీల్, అనసూయ నటీనటులుగా తెరకెక్కిన తాజా చిత్రం దర్జా . ఇక ఈ సినిమా ఈరోజు విడుదలయ్యి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందాయి. అంతేకాదు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరపగా అందులో అనసూయ చెప్పిన డైలాగులు ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు.DARJA Movie Telugu Cast, Release Date, DVD Release Date, Ott Release Date,  Teaser, Trailer, Budget, Wiki, Budget, and Details – Daily Movie Mania

ఇక ఈ సినిమాలో అనసూయ ఒక సారా వ్యాపారిగా.. తన వ్యాపారానికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరిని హతమార్చుకుంటూ.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంది. అడ్డొచ్చిన పోలీసులను, ఎమ్మెల్యేలను సైతం మట్టబెట్టే అంత ధైర్యం ఆమెకుంటుంది. ఇక ఆమెను హతమార్చడానికి ఎస్ఐ రూపంలో సునీల్ ఈ చిత్రంలో మనకు కనిపిస్తాడు. ఇక అనసూయ, సునీల్ ఇద్దరు ఒకరికొకరు పోటాపోటీగా ఈ సినిమాలో పోటీ పడడం మనం గమనించవచ్చు. చివరికి అనసూయను సునీల్ ఎలా అంతం అందించాడు అనేది సినిమా కథ.Darja (2022) - Movie | Reviews, Cast & Release Date in kolkata - BookMyShow

ఈ సినిమా ఒక ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం అని చెప్పవచ్చు. ఇక బంధం, బంధుత్వం మధ్య సాగే సెంటిమెంట్ తో పాటు కావలసిన యాక్షన్ కమర్షియల్ వాల్యూస్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అనసూయ సన్నివేశంలో ఉన్నంతసేపు చాలా ఉత్కంఠగా సాగుతూ అలాగే అదే ఉత్కంఠ తో మిగిలిన పాత్రలను కూడా కొనసాగించేలాగా చేశాడు దర్శకుడు. అంతేకాదు ఈ చిత్రంలో మరో ప్రేమ కథను కూడా చూపించడం అలాగే కామెడీ సీన్స్ అన్నీ కూడా ఆల్ గుడ్ అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమిటంటే రాప్ రాక్ షకీల్ సంగీతం అని చెప్పవచ్చు. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు.ముఖ్యంగా కథలో అన్ని పాత్రలు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లారు. ఇక మొత్తానికైతే కనీసం అనసూయ , సునీల్ కోసం అయినా సరే ఖచ్చితంగా దర్జా సినిమాను థియేటర్ కి దర్జాగా వెళ్లి చూడవచ్చు. ఇక ఈ సినిమాతో సునీల్ , అనసూయ ఇద్దరూ కూడా తమ ఖాతాలో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.