ఫ్లాష్.. ఫ్లాష్.. షూటింగ్‌లపై ఫిల్మ్ చాంబర్ సంచలన నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సినిమా షూటింగ్ లు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు, సురేష్ బాబు ఆధ్వర్యంలోని టాలీవుడ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మద్దతు తెలిపింది.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు షూటింగ్ లు బంద్ చేయాలని ఫిల్మ్ చాంబర్ జనరల్ బాడీ సమావేశంలో నిర్మాతలందరం కలిసి నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల షూటింగ్ లను కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ సమావేశంలో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా కొత్త బసిరెడ్డిని ఎన్నుకున్నారు.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగుతుందని, తర్వాత చర్చించి షూటింగ్ లను తిరిగి ప్రారంభించడంపై ఆలోచిస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే దాదాపు 30 సినిమాపై ఈ బంద్ ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు, పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఎన్టీఆర్ 30, బాలకృష్ణ 107వ సినిమా, ప్రభాస్ మూడు సినిమాలు, అఖిల్-ఏజెంట్, సమంత-యశోద, విజయ్ దేవరకొండ-ఖుషి సినిమాలు ఆగిపోనున్నాయి. దాదాపు పెద్ద హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

ఆగస్టు 2న మరోసారి ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలందరం సమావేశమై షూటింగ్ లపై చర్చించుకుంటామని దిల్ రాజు ప్రకటించారు. 24 కాఫ్ట్స్ లోని సమస్యలు అన్నీ పరిష్కారం అయిన తర్వాతే షూటింగ్ లు మొదలవుతాయని తెలిపారు.

Share post:

Popular