ఈసారైనా అనుపమకి కలిసొస్తుందా? ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

అనుపమ పరమేశ్వరన్ పరిచయం ఇప్పుడున్న యూత్ కి అక్కర్లేదేమో. మలయాళ ‘ప్రేమమ్’తో సినీ కెరీర్ ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అ ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పోతోంది. అయితే సినిమాల హిట్లు ఆవిషయంలోనే అమ్మడుకి పెద్దగా కలసి రావడంలేదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమదైన నటనతోనే కాకుండా గ్లామర్ షోతో రాణించేవారు ఎందరో వున్నారు. కానీ అనుపమ పరమేశ్వరన్ కి ఏదీ కలిసి రావడం లేదు.

ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

అనుపమ పరమేశ్వరన్, హీరో శర్వానంద్ కు జోడీగా ‘శతమానం భవతి’ సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వడం వలన అమ్మడుకి కాస్త ఊరట లభించింది. కానీ ఆమెకి ఇపుడు ఓ మాస్ ఇమేజ్ కావాలి. అందుకోసమనే రకరకాల సబ్జక్ట్స్ ఎంచుకుంటోంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండే ఈ ముద్దుగుమ్మ.. రూటు మార్చి గ్లామర్ షోతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా కూడా బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్లో వేరె లెవల్ లో అందాలు ఆరబోసి నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేసింది.

రూటు మార్చిందా?

ఇండస్ట్రీలో నిలబడాలంటే ఖచ్చితంగా అందాల ప్రదర్శన చేయాల్సిందే అని ఎవరన్నా చెప్పారేమో అన్నట్టుగా అనుపమ పరమేశ్వరన్ యు టర్న్ తీసుకుంది. క్లీవేజ్ షో చేయాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్టు అనిపిస్తోంది. తాజాగా అలాంటి సినిమాలకే పెద్దపీట వేసినట్టు కనబడుతోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలే దానికి నిదర్శనం అని అంటున్నారు. మరి ఇలాగైనా అనుపమ కెరీర్ కు కలిసొస్తుందో లేదో చూడాలి మరి. కాగా అనుపమ చేతిలో ప్రస్తుతం ‘కార్తికేయ 2′ ’18 పేజెస్’ ‘బటర్ ఫ్లై’ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలపైనే అనుపమ తన ఆశలన్నీ పెట్టుకుంది.