అమలకు ఆ లోపం..అందుకే మ్యాటర్ విడాకుల వరకు వెళ్లిందా ..?

కోలీవుడ్ హీరోయిన్ అమల పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం తో నటనతో కుర్రాళ్ళ మతులు పోగొట్టిన బ్యూటీ. రఘువరన్ B.Tech సినిమాతో తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకున్న బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉండగానే..అమల పాల్ కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అబ్బో ఆ టైంలో వీళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ ఫోటో షూట్లు..ఆ హంగామా..మీడియాలో హైలెట్ గా నిలిచింది.

ఎంత త్వరగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారో..అంతే త్వరగా..విడిపోయి..అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఎవ్వరు ఊహించని విధంగా డివర్స్ తీసుకుని..అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అయితే, వీళ్ల డివర్స్ కి కారణాలు మాత్రం వెల్లడించలేదు. కొందరు ఏమో విజయ్ కి అమల సినిమాలో నటించడం ఇష్టం లేదని..కానీ, ఆమె అందుకు ఓప్పుకోలేదని. దీంతో మాట మాట పెరిగి..చివరకు డివర్స్ వరకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

అయితే, తాజాగా అమల పాల్ కు భర్త విడాకులు ఇవ్వడానికి కారణం ఇదే అంటూ కోలీవుడ్ లో ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి విజయ్ కి పిల్లలు అంటే చాలా ఇష్టమట..పెళ్ళైన వెంటనే పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అంటూ చెప్పారట. కానీ, అమల దానికి ఒప్పుకోలేదట. అప్పటి వరకు బాగానే ఉన్నా..పిల్లలు అనగానే భర్తను దూరం పెడుతూ వచ్చిందట . కానీ, నిజానికి అమల పాల్ కి పిల్లలు పుట్టే అవకాశం లేదని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అందుకే అమలా పాల్ కి విజయ్ డివర్స్ ఇచ్చారంటూ కోలీవుడ్ లో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ప్రజెంట్ అమల పాల్ సింగిల్ గా బ్రతుకుతూ..వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సినిమాలు చేస్తుంది.

Share post:

Latest