IMDB 2022లో టాప్ 10 ఇండియన్ సినిమాలు ఇవే..!!

కరోనా మహమ్మారి తో అతలాకుతలం అయిన సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది చాలా స్పెషల్ గా నిలిచింది. కరోనా తో ఫైనాన్షీయల్ గా బాగా దెబ్బతిన్న సినీ ఇండస్ట్రీ..2022 లో రిలీజ్ అయిన సినిమాలతో కొంచెం లాభపడింది. ఆల్ మోస్ట్ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమా మంచి హిట్స్ నే అందుకున్నాయి. మరీ ముఖ్యం గా తెలుగు లో ప్రభాస్ రాధే శ్యామ్, మెగాస్టార్ ఆచార్య తప్పిస్తే..మిగిలిన అన్ని సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించాయి.

కాగా , ఈ క్రమంలోనే అంతర్జాతీయ ప్రఖ్యాత సమీక్ష సంస్థ IMDB 2022కి గానూ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన RRR, KGF2 ల కన్నా కూడా..సైలెంట్ గా రిలీజ్ అయ్యి..బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగ రాసిన ‘విక్రమ్'(తమిళం) ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఈ జాబితాలో 8.8 రేటింగ్‌తో విక్రమ్‌ మొదటి స్థానంలో నిలిచింది. జనవరి 1, 2022 మరియు జూలై 5, 2022 మధ్యరిలీజ్ అయిన సినిమా లల్లో ప్రజలు ఎక్కువుగా చూసిన మెచ్చి IMDB 7 లేదా అంతకంటే ఎక్కువ రేట్ చేయబడిన చలన చిత్రాలను ద్వారా ఈ లిస్ట్ ప్రిపేర్ చేశారు టీం. అయితే తొలి పది స్థానాల్లో ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ తప్ప, మరో తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం..

అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 భారతీయ సినిమాల లిస్ట్ చూద్దాం రండి…

1. విక్రమ్ సినిమా

2. ‘కేజీఎఫ్ 2’

3. ‘ది కాశ్మీర్ ఫైల్స్’

4. ‘హృదయం’

5. ‘ఆర్ఆర్ఆర్’

6. ఏ థర్స్ డే

7. ఝుండ్

8. ‘రన్‌వే 34’

9. ‘గంగూభాయ్ క‌తియావాడీ’

10.’సామ్రాట్ పృథ్వీరాజ్’