రవితేజ వల్లే జై లవకుశ సినిమా తెరకెక్కిందా.. అసలు విషయం ఇదే..!!

మొట్టమొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ జై లవకుశ సినిమాలో మూడు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ ఇరగదీసారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్ర కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూశారని చెప్పడంలో సందేహం లేదు.. ఇక మరొక విశేషం ఏమిటంటే అప్పటివరకు అప్పుల్లో కూరుకుపోయిన కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అందించి అప్పుల బాధ నుంచి విముక్తి చేశాడు ఎన్టీఆర్. ఇక అలా తన అన్నను అప్పుల ఊబి నుంచి కాపాడాడు ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇక ఆ రోజు నుంచి ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా నిర్మాణంలో కూడా కళ్యాణ్ రామ్ భాగం అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జై లవకుశ సినిమా రవితేజ వల్లే తెరకెక్కింది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.Confirmed: Jr NTR's Jai Lava Kusa to release on September 21 - Movies News

అసలు విషయం లోకి వెళ్తే..జై లవకుశ సినిమాను తెరకెక్కించిన బాబీ ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గా హాజరై ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ రవితేజ గురించి అలాగే జై లవకుశ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రవితేజ గురించి మాట్లాడుతూ రవితేజ తో ఒక సినిమా చేస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుందని మాలాంటి వాళ్ళ రేంజ్.. రేంజ్ రోవర్ స్థాయికి సెట్ అవుతుందని బాబి వెల్లడించారు .అంతేకాదు రవితేజతో పవర్ సినిమాకు దర్శకుడిగా పనిచేయడం వల్లే తన లైఫ్ మారిపోయిందని ఇక ఈ సినిమా రిసల్ట్ తోని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదని తెలిపారు బాబి.Actor Ravi Teja to sign one more film with THIS young director: Total 7  films in hand now | Telugu Movie News - Times of Indiaఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితంతో ఆయన సంబంధం లేకుండా నాకు మరో అవకాశాన్ని ఇచ్చారు అని రవితేజ గురించి వెల్లడించారు. ఇకపోతే రవితేజతో మరో సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలోనే జై లవకుశ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఇక నేను ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఆ విషయాన్ని రవితేజతో చెప్పాను .సాధారణంగా వేరే హీరోలైతే ఈ విషయాన్ని ఒప్పుకోరు. కానీ రవితేజ వెంటనే పర్వాలేదు నువ్వు వెళ్లి ఆ సినిమా షూటింగ్ చేయి అని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలా రవితేజ వల్లే జై లవకుశ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ విజయం అయింది అంటూ రవితేజ గురించి చాలా గొప్పగా చెప్పారు బాబి.

Share post:

Latest