నందమూరి తారక రత్న ఇంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం ఇదేనా…?

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అగ్రనాయకులలో ఒకరు అయినా మన నందమూరి తారక రామారావు గురుంచి తెలియని వారు ఉండరు. మరి అటువంటి మహానుభావుడి వంశం నుంచి అనేక మంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టింది మాత్రం నట సింహం బాలయ్య, అలాగే వారి వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు చేసుకుంటూ.. నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఇక నందమూరి తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు. కాగా నందమూరి వారసుల లో ఇప్పుడు స్టార్ హీరో గా చలామణి అవుతున్న ఒకే ఒక్క వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. అయితే అసలు నందమూరి తారకరత్న ఎందుకు ఇన్ని రోజులూ సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నందమూరి తారక రత్న తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. కాకపోతే అసలు తారక రత్న ఇన్నిరోజులు ఎక్కడున్నారు..? ఏం చేశారు..? అసలు ఎందుకు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు..? అనే విషయానికి వచ్చినట్లయితే….సీనియర్ ఎన్టీఆర్ తనయులలో ఒకరు అయినా నందమూరి మోహనకృష్ణ వారసుడిగా నందమూరి తారక రత్న 1983 జనవరి 8వ తేదీన జన్మించారు. కాగా ఈయన నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో సహనం కోల్పోయిన తారకరత్న ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ చూసుకుంటూ ఉండిపోయారు.

అయితే ఇండస్ట్రీలో రాముడి పాత్ర పోషించాలి అంటే అది ఒక్క నందమూరి కుటుంబానికే చెందినట్టుగా ఎన్టీఆర్ తర్వాత ఆ వంశానికి చెందిన బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తారకరత్న కూడా ఎక్కువగా రాముడు పాత్రలు పోషించే వాళ్ళు. అంతేకాదు ఈ హీరో ఏకంగా ఒక్క సినిమా కూడా చేయక ముందే ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసాడు. అప్పట్లో ఏకంగా 9 సినిమాల షూటింగ్ ఒకే రోజు ప్రారంభించిన ఏకైక హీరో తారక రత్న. ఈ రికార్డు ను ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. 2001 లో ఒకటో నెంబర్ కుర్రాడు అనే మూవీ తో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తారక రత్న మిగతా 8 సినిమాలు కూడా అదే రోజు మొదలు పెట్టి సంచలనం సృష్టించ్చారు. రావడం రావడం తోనే తొమ్మిది సినిమాల హీరోగా పిలవబడ్డాడు.అయితే అందులో చాల వరకు విడుదల అవ్వక ముందే ఆగిపోయాయి.

ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్,యువరత్న,నో, భద్రాద్రి రాముడు అనే చిత్రాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగిలిన మూవీస్ అన్ని ఆగిపోయాయి.అయితే చాలా కాలం తర్వాత అమరావతి అనే సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు. తర్వాత కూడా ఇంకొన్ని సినిమాల్లో విలన్ గా రాణించాడు. కానీ ఏది ఏమైనా కూడా హీరోగా గుర్తింపు సంపాదించలేకున్నా తారక రత్న 9 సినిమాల హీరో అనే రికార్డు మాత్రం దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న తారక రత్న ఈ సారి అయినా సక్సెస్ నీ అందుకుని సినీ ఇండస్ట్రీ లో నిలదొక్కుంటారో లేదో వేచి చూడాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

Share post:

Latest