“ఆరుగురు పతివ్రతలు” హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

ఎందరో నటీమణులు కొన్ని సినిమాలకే కనుమరుగైపోతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నా టాలెంట్ ఉన్నా కెరీర్ ను కొనసాగించలేకపోవడం కొందరు దురదృష్టం అని చెప్పాలి. ఈ కోవలోకి చాలా మంది వస్తారు.. అటువంటి వారిలో ఒకరే నటి అమృత. ఈమె కన్నడ సినిమా పరిశ్రమకి చెందినది కావడం గమనార్హం. అలంటి నటి అమృతను స్వర్గీయ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ టాలీవుడ్ కు తీసుకు వచ్చాడు. తాను దర్శకత్వం వహించిన ఆరుగురు పతివ్రతలు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అమృత నటనను చూపించాడు. ఈ సినిమాను నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు. అయితే ఒక గొప్ప డైరెక్టర్ ఈ తరహా సినెమాలను తెరకెక్కించడం అంత సులభం కాదు. కానీ ఈ సినిమా చూసిన వారికి ఈ వి వి సత్యనారాయణ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో అందరూ షాక్ అయ్యారు. కానీ కథ వలన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా ఇప్పటికీ అప్పుడప్పుడు బుల్లితెరపై వస్తూ ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఇప్పటికీ బాగుంటాయి. ఇందులో ముఖ్య పాత్రలలో అమృత, విద్య, నేత, ఎల్ బి శ్రీరామ్, చలపతి రావు, రవివర్మ మరియు అజయ్ రాజ్ లు నటించి మెప్పించారు. ఇంత మంది నటులు ఇందులో ఉన్నా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది మాత్రం అమృత అనే చెప్పాలి. మొగుడి ఉండగానే వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని సంసారాన్ని సాగించే వివాహిత పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తన మార్క్ ను కనబరిచింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో ఏ సినిమాలోనూ నటించినట్లు లేదు. అయితే ఇటువంటి పాత్రలో చూసిన ప్రేక్షకులు మళ్ళీ ఈమెను అలాంటి పాత్రలలోనే ఊహించుకుంటారు అన్న అభిప్రాయంతో ఏమో తెలియదు కానీ ఎటువంటి అవకాశాలు రాలేదు.

అయితే ఈ సినిమా చేసిన తర్వాత కన్నడ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంది అమృత, ఆ తర్వాత కొంతకాలినికి ఈమె తన దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. అమెరికాలో ఏదో చేయకూడని పని చేస్తున్న విషయంలో అమృత కేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణంతో కన్నా సినిమా ఇండస్ర్టీ కూడా అమృతను ఆదరించలేదు. ఈహతే అమృత తన టోటల్ సినిమా కెరీర్ లో మూడు భాషలలో కలిపి 10 సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమృత బెంగుళూరు లో నివసిస్తోంది.