సెక్స్ అంటే భయపడుతున్న అరబ్ కుర్రాళ్ళు.. కార‌ణం ఇదే…!

సెక్స్ మనిషి సంసారం జీవితంలో ఓ భాగం. కాలం ఎంతో ముందుకు సాగిపోతున్నప్పటికీ ఈ అంశంపైన ఇంకా అనేకరకాల అనుమానాలు నేటి సమాజంలో వున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అరబ్ దేశం గురించి మాట్లాడుకుంటే, వారు శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం నిత్యం పరితపిస్తూ వుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా వారు సంప్రదాయ ఔషధాలను వాడుతూ వుంటారు. దానికి అనేక లోకల్ రీజన్స్ వున్నాయి.

ఇక శృంగార ఉద్దీపనలు కలిగించే ఆహారం, పానీయాలు, మూలికలు తీసుకోవడం పురాతన కాలం నుంచే వస్తోంది. సాధారణంగా అరబ్ దేశాల్లో కాస్త వయసు ఎక్కువగా ఉన్న మగవారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ సంప్రదాయ ఔషధాలు లేదా మాత్రలను ఆశ్రయిస్తారు. అయితే గత కొంత కాలంగా అక్కడ ట్రెండ్ మారుతోంది. పశ్చిమ దేశాలు తయారు చేసే వయాగ్రా వంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచే బ్లూ పిల్స్‌ను అరబ్ యువకులు ఎక్కువగా వాడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది.

ఇందుకు ప్రధాన కారణం సెక్స్‌లో బాగా చేయాలనే ఒత్తిడి వారి మీద ఉండటమేనని పరిశోధకులు చెబుతున్నారు. యువకులు సిల్డెనాఫిల్(వయాగ్రా), వర్డెనాఫిల్(లెవిట్రా), టడలాఫిల్(సియాలిస్) వంటి బ్లూ పిల్స్‌ను వాడటం గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రబియా అల్-హబాషీ అనే అతను ఈజిప్టు రాజధాని కైరోలోని బాల్ అల్-షరియాలో మూలికల దుకాణాన్ని నడుపుతుంటారు.

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే అనేక సంప్రదాయ మూలికలు, ఔషధాలు విక్రయించే వ్యక్తిగా అతగాడికి స్థానికంగా మంచి పేరు వుంది. ఇపుడు అతనే స్వయంగా కొద్ది సంవత్సరాలుగా కస్టమర్ల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు అక్కడి యువత ‘పశ్చిమ దేశాలు తయారు చేసే బ్లూ పిల్స్‌ను ఎక్కువగా మగవారు కొనుగోలు చేస్తున్నారు.’ అని తెలిపారు.