వాటిని బయటపెడుతూ పూజా హెగ్డే పై దారుణమైన ట్రోల్స్..!!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువవుతోన్న నేపథ్యంలో ఎప్పటివో చూడని వీడియోలు , ఫోటోలు కూడా బయట పడుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల చిన్ననాటి ఫోటోలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూ ఉండటం గమనార్హం. అయితే కొన్ని సందర్భాలలో వీరు దిగిన ఫోటోలు అనుకోకుండా బయటకి రావడంతో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు నటీనటులు. ఇక ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డే కూడా ఒకప్పటి ఫోటో బాగా ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది. అసలు విషయం ఏమిటి అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే కేవలం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తన సినిమాలతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా .. దర్శకులు ఈమె వైపే మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం. ఇక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది.


2010లో మొదటిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన పూజాహెగ్డే.. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ముకుందా సినిమాల్లో కూడా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అలా వైకుంఠపురం లో సినిమాలో నటించి బుట్ట బొమ్మ గా మారిన ఈమె వరుసగా అవకాశాలు అందుకుంది . ఇక ఇటీవలే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో నటించినప్పటికీ వరుసగా ఫ్లాప్ లను అందుకొని నిరాశ చెందింది.

మళ్లీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పూజా హెగ్డే తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది m ఇక ఈ క్రమంలోనే గతంలో తన స్కూల్ సమయంలో ఐస్ క్రీమ్ తింటూ దిగిన ఒక ఫోటో షేర్ చేయగా.. ఈ ఫోటో బాగా ట్రొల్ కి గురవుతోంది. అంతేకాదు పూజా హెగ్డే అప్పటికంటే ఇప్పుడే బాగుందని కామెంట్ లు కూడా వినిపిస్తున్నాయి.

Share post:

Popular