రీసెంటుగా ఓ టి టి లో సత్తా చాటిన 8 సినిమాలివే ?

కరోనా కాలంలో జెట్ స్పీడ్ లో దూసుకొచ్చింది ఓ టి టి రంగం. దొరికిందే ఛాన్స్ అని ఈ వేదిక వాయు వేగం అందుకుంది. కొత్త ఓ టి టి వేదికలు, సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకర్షించాయి. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ మాత్రమే అనుకునే ప్రేక్షకులు ప్రస్తుతం ఈ సినిమా కి థియేటర్ అవసరమా, ఈ సినిమాకి ఓ టి టి నే ఎక్కువ అని లెక్కలు వేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది విషయం. చాలా వరకు చిత్రాలు ప్రేక్షకులు ఓ టి టి ల్లో చూడటానికే ఇష్టపడుతున్నారు. అగ్ర హీరో, విజువల్స్ ఎఫెక్ట్స్ భారీగా ఉండి, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప థియేటర్ గడప తొక్కేదే లే…అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అలాగే నిరూపిస్తున్నారు కూడా. అంతగా ఓ టి టి లు ప్రేక్షకుల మనసుల్లో నిండిపోయాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే వీటిలో ప్రస్తుతం ఎక్కువగా స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు, ఈ మధ్య ప్రేక్షకులు ఆదరణ పొంది దుమ్ము లేపుతున్న చిత్రాలు ఎవి అంటే..!!

ఓల్డ్ మాంక్ : కన్నడ మూవీ ఓల్డ్ మంక్ ఈ మధ్య ఓ టి టి లో తెగ స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కువ మంది ఈ సినిమాకి అట్రాక్ట్ అవుతున్నారు. రేసి స్క్రీన్ ప్లే, కామెడీ యాంగిల్ లో ఫుల్ గా ఎంటర్టైనర్ చేస్తుండటంతో ఈ సినిమా ఆదరణ అలా పెరిగిపోతోంది. అయితే ఇది ప్రస్తుతానికి కన్నడ లో మాత్రమే అవైలబుల్ లో ఉంది. ప్రస్తుతం ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

దస్వి: ఇక బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం దస్వి. సోషియో పొలిటికల్ కామెడీ డ్రామా జోనర్ లో డైరెక్ట్ గా ఓ టి టి కి వచ్చిన ఈ సినిమా కూడా ఈ వేదికపై స్పీడ్ పెంచింది. ఎడ్యుకేషన్ , నాలెడ్జ్ రెండు పాయింట్స్ ను హైలెట్ చేస్తూ తీసిన ఈ చిత్రం అందరి మన్నలను పొందుతోంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్ లో అందుబాటులో ఉంది.

గంగూభాయ్ కథియా వాడి: ఇటీవల అలియా భట్ నటించిన గంగుభాయ్ కథియా వాడి సినిమా కూడా ఓ టి టి లో దుమ్ము దులుపుతోంది. ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్ లో అందుబాటులో ఉంది. అలాగే ఇంగ్లీష్ మూవీ అయిన కింగ్ రిచర్డ్ మూవీ కూడా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రే సినిమా స్ట్రీమ్ అవుతోంది. తమిళ డబ్బింగ్ మూవీ చిన్ని కూడా ఈ వేదికపై వేగంగా ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రైమ్ లో ఈ మూవీ అవైలబుల్ లో ఉంది.

జుండ్: అమితాబ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జుండ్. ఇది ఒక ఫుట్ బాల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కింది. స్లమ్ లో ఎటువంటి లక్ష్యం లేకుండా చేదు అలవాట్లకు బానిసలుగా మారుతున్న యువతను మార్చే కథగా తీర్చిదిద్దారు. ఈ సినిమా రెగ్యులర్ స్పోర్ట్ సినిమాలాగా కాకుండా కొంచెం వాస్తవిక అంశాలను జోడించి తీశారు. ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

కింగ్ రిచర్డ్ : అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్స్ సెరెనా విలియమ్స్ మరియు వీనస్ విలియమ్స్ గురించి తెలిసిందే. టెన్నిస్ లో ఎన్నో రికార్డులు వీరి పేరిట ఉన్నాయి. అయితే వీరి విజయాల వెనుక ఉన్నదీ ఎవరో కాదు వారి తండ్రి రిచర్డ్ విలియమ్స్. అందుకే వీరి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒక టెన్నిన్స్ స్పోర్ట్స్ డ్రామా గా వచ్చిన అందరి మనసులనను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

చిన్ని: మహానటి కీర్తి సురేష్ మరియు శ్రీరాఘవ మాస్ లుక్ లో నటించిన ప్రతీకార చిత్రం చిన్ని. ఇందులో తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎదరించి ఆ దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలలో కీర్తి సురేష్ జీవించేసింది. ఇందులో డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో బాగా ఆకట్టుకున్నాడు. ఇది అందరి మన్ననలను అందుకుంటోంది. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో వెళ్లి చూడవచ్చు.

పోలీసోడు: ఈ సినిమాను 1997 లో తమిళనాడు లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంపు లో జరిగిన వాస్తవిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ప్రతి ఒక్క పోలీస్ ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. అంతే కాకుండా భవిష్యత్తులో పోలీస్ కావాలని అనుకున్న వారు కూడా చూసి మీకున్న హక్కులు ఏవో తెలుస్కోవాలి. సిస్టం లో ఇంకా ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయో… అన్నది అందరూ తెలుసుకోవాలి. ఈ సినిమాను చూడాలంటే డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ది కాశ్మీర్ ఫైల్స్: కాశ్మీర్ లో నివసించే పండిట్ లపైన ఎన్నో దురాగతాలు జరిగాయి. అయితే ఇవనీ ఇప్పట్లో ఉన్న చాలా మందికి తెలియదు. అలంటి ఒక ప్రయత్నమే కాశ్మీరీ ఫైల్స్. ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది.. మొదట థియేటర్ లలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఓ టి టి లోనూ తన సత్తా చాటుతోంది.

ప్రస్తుతం ఈ చిత్రాలు ఓ టి టి లో ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రాలుగా ఉన్నాయి.

Share post:

Latest