హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న 30 ఇయ‌ర్స్ పృథ్వి డాట‌ర్‌…!

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే దారిలోనే స్టార్ హీరోల, హీరోయిన్ల వారసులు మాత్రమే కాదు కమెడియన్ల కూతుర్లు, కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా వీరు తమ ప్రతిభతో సక్సెస్ అయితే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. లేకపోతే మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది.

ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా అబ్బాయిలు వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వారసురాళ్ళు అంటే మంచు లక్ష్మి, జీవిత కూతుర్లు ప్రస్తుతం వారసురాళ్ళుగా కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే వీరి బాటలోనే మరొకరు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన సినీ ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని నిలుపుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈయన కుమార్తె శ్రీలు కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి పృథ్వీ తెలియజేశారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన ఈమె మలేషియాలో స్థిరపడాలని అనుకుంది. అయితే తనకు నటనపై ఆసక్తి ఉండటం వల్ల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని పృథ్వీ వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పార్ట్నర్స్ తో కలిసి మా అమ్మాయి ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా నిర్మించారు. ఇక దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని తెలిపారు. ఇక కమెడియన్ పృథ్వి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు . ఇక నటిగా తన కూతురు కూడా గుర్తింపు సంపాదించుకోవాలని ఆయన కలలు కంటున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Share post:

Popular