సింగర్ ‘కేకే’ పాడిన తెలుగు పాటలు ఇవే అని మీకు తెలుసా?

ఇండియన్ సినిమాలో ఎందరో గోపా గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఒక సినిమాకు కథ, కథనం ఎంత ముఖ్యమో… ప్రేక్షకులను మైమరపింపచేసే పాటలు ఉండడం కూడా అంతే ముఖ్యం. చాలా సినిమాలు కేవలం పాటలతోనే విజాయ్న్ని సాధించిన దాఖలాలు ఉన్నాయి. అలంటి పాటలను అద్భుతంగా పాడే గాయకులకు ఒక సుప్రసిద్ధ గౌరవం ఉంది. అటువంటి గాయకులలో ఒకరే ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్. ఇతనిని ముద్దుగా కేకే అని పిలుచుకుంటుంది ఇండియన్ సినిమా. కేకే ఎక్కువగా బాలీవుడ్ లో తన పాటలను ఆలపించాడు. అయితే ఒక్క హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, బెంగలై, అస్సామీ మరియు గుజరాతీలలో కూడా పాడాడు. ఇతను సింగర్ కాకా ముందు ఒక వాణిజ్య ప్రకటన కోసం తన వాయిస్ ను ఇచ్చాడు. ఆ తర్వాత మొట్టమొదట పాటను ఏ ఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో పాడడం జరిగింది.

కేకే మంగళవారం కోల్కతాలో ఒక ఈవెంట్ కు హాజరయి పాటపాడుతూనే మరణించడం జరిగింది. ఈయన పాడిన చాలా పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇతని గురించి క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే పాటే ఇతని ప్రాణం. అందుకే కాబోలు పాత పాడుతూనే తన చివరి శ్వాసను వదిలాడు. కోల్కతాలోనే వివేకానంద కాలేజ్ లో లైవ్ షో చేస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే హుటాహుటిన అక్కడి నుండి కేకే ను దగ్గర్లోనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా, ఇతనిని పరిశీలించిన వైద్యులు అదే రోజు రాత్రి 10.30 కే కేకే మరణించినట్లు తెలియచేసారు. కాగా ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు. కేకే అన్ని భాషలలో కలిపి దాదాపు 250 కి పైగా పాటలను పాడి ప్రేక్షకులను అలరించాడు.

ఈయన ఈ ప్రోగ్రాం కు వచ్చే ముందు కూడా తన షో గురించి ఇంస్టా పేజీ లో పోస్ట్ చేశారు. అయితే ఈయన మృతి పట్ల దేశం లోని ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. సంతాపం తెలిపిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సింగర్ అర్మాన్ మాలిక్, అక్షయ్ కుమార్, మున్ముం దత్త, సోనాల్ చౌహన్ లు ఉన్నారు. ఇక అర్మాన్ మాలిక్ మాట్లాడుతూ కేకే యొక్క ప్రతిభను తెలిపారు. ఈ రోజు కేకే మన మధ్య లేరు అన్నది నమ్మశక్యంగా లేదని బాధ పడ్డాడు.

ఇక కేకే తెలుగులో పాడిన కొన్ని సూపర్ హిట్ పాటలను చూస్తే.

స్టూడెంట్ నెంబర్ వన్ – ఒకరికి ఒకరి ఉంటుంటే…

ఆర్య – ఫీల్ మై లవ్….

ఇంద్ర – దాయి దాయి దామ్మా…

గుడుంబా శంకర్ – లే లే లే లే ఇవాళే లేలే….

శంకర్ దాదా ఎంబిబిఎస్ – చైల చైల చైలా చైలా…

నేనున్నాను – నీ కోసం నీ కోసం….

జయం – ప్రేమ ప్రేమా ప్రేమా…

సంతోషం – దేవుడే దిగివచ్చినా…

జై చిరంజీవ – హే జాణ…

ఘర్షణ – చెలియా చెలియా…

నా ఆటోగ్రాఫ్ – గుర్తుకొస్తున్నాయి…

బంగారం – చెడుగుడంటే భయ్యం…

సైనికుడు – గో గో అదిగో…

పైన తెలిపిన తెలుగు పాటలు పాడాడు.