ఈసారి ఆ హీరో మిస్ అవ్వడు ..విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!

రాజమౌళి..ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. ఓ స్టార్ హీరో కన్నా …ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్…కాదు కాదు..స్టార్ నెం 1 డైరెక్టర్ అంటున్నారు ఆయన అభిమానులు. ఆయన అందుకు అర్హులు. వెనక పడిపోతున్న మన తెలుగు ఇండస్ట్రీని ఆయన సినిమాలతో టాప్ పోజీషన్ లో నిలపెట్టారు అనడం లో సందేహం లేదు. బాహుబలి సినిమా తెరకెక్కించని ముందు వరకు రాజమౌళి వేరు…అప్పటి వరకు ఆయన రేంజ్ ఒకలా..బాహుబలి సినిమా తరువాత మరోలా..మారిపోయింది.

ఇప్పుడు బడా బడా స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్ లో నటించాలని ట్రై చేస్తున్నారు. స్టార్ హీరో ల ఫ్యాన్స్ కూడా..మా హీరో తో సినిమా చెయ్యి అంటే మా హీరో తో చెయ్యి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు మహేశ్ బాబు అభిమానుల కోరిక మేరకు..రాజమౌళి-మహేశ్ సినిమా సెట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా, మిగతా స్తార్ హీరోలు..పవన్ కల్యాణ్, బన్నీ, బాలయ్య, లాంటి హీరో ల ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలతో రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుందా అని వెయిటింగ్..

కాగా, అలాంటి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే, రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నాడని ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఆయన రిజెక్ట్ చేయడం వల్లే రవితేజ కు వెళ్లింది ఆ సినిమా. ఇక ఆ తరువాత ఎందుకో వీళ్ల కాంబో సెట్ అవ్వలేదు. అయితే, రీసెంట్ ఇంటర్వ్యుల్లో విజయేంద్ర ప్రసాద్..” పవన్ కళ్యాణ్ కోసం ఓ కథని రెడీ చేశానని..ఆ కధ పవన్ కి ఖచ్చితంగా నచ్చుతుందని..ఒక్కవేళ ఆయన రిజెక్ట్ చేస్తే ఆ కధ ను అలాగే దాచుకుంటాను తప్పిస్తే..వేరే హీరోలతో చేయను” అంటూ చెప్పుకొచ్చారట. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని..కానీ, ఇంతటి ఫ్యాన్ నా పవన్ కి ఆయన అనేది ఇప్పుడే అర్ధమైంది అంటున్నారు పవన్ ఫ్యాన్స్. మరి చూడాలి పవన్ ఏం చేస్తారో..?

Share post:

Popular