సింగర్ సునీత కూతురు ఇంత అందంగా ఉంటుందా.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

సింగర్ సునీత గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసింది సునీత. అప్పుడెప్పుడో వచ్చిన గులాబి సినిమా నుంచి ఈ మధ్యన వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వరకు ఆమె తన గానామృతంతో ప్రతి ఒక్కరి మనసులను పులకరింపజేసింది. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆమె గాత్రం, అంతకుమించిన అందం ఆమెను ప్రత్యేకంగా నిలుపుతుందని అనడంలో సందేహం లేదు.

ఆమె పాడిన ఎన్నో మెలోడీస్ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. సౌందర్య, భూమిక, సోనాలి బింద్రే, సదా, నయనతార తమన్నా, అనుష్క… ఇలా ఎందరో స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సునీత. అయితే సోషల్ మీడియా ప్రభంజనం తర్వాత ఆమె గాత్రంతో పాటు ఆమె లైఫ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది. సునీత తనకంటూ ఒక స్పెషల్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ కూడా ఓపెన్ చేసి తన అభిమానులకు మరింత చేరువైంది.

ఈ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్‌తో ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటూ తన గురించి, తన ఫ్యామిలీ గురించి అన్ని అప్‌డేట్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె తన ముద్దుల కూతురు శ్రేయ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జూన్ 19న ఎమర్జింగ్ సింగర్ శ్రేయ తన పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా సునీత కూతురు శ్రేయ కోసం స్పెషల్‌గా ఒక బర్త్‌డే పోస్ట్ పెట్టింది.

“ఎప్పుడూ సంతోషంగా ఉండండి నాన్నా.. బర్త్ డేని సూపర్ డూపర్ గా ఎంజాయ్ చెయ్. యువర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. హ్యాపీ బర్త్‌డే” అని ఒక స్వీట్ పోస్ట్ పెట్టింది. అలాగే మరొక పోస్టులో “విత్ బర్త్‌డే గర్ల్” అనే క్యాప్షన్‌తో శ్రేయ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే శ్రేయ హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోకుండా చాలా అందంగా కనిపించింది.

ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది నెటిజన్లు సునీతకి ఇంత అందమైన కూతురు ఉందా.. ఈ అమ్మాయి హీరోయిన్‌గా కూడా ట్రై చేయొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. శ్రేయ సవ్యసాచి సినిమాతో సింగర్‌గా పరిచయం అయింది. ఆమె తన సింగింగ్ స్కిల్స్‌పై మరింత దృష్టి సారిస్తూ ఫుల్ టైమ్‌ సింగర్‌గా సెటిల్ అవ్వాలని చూస్తోంది. మరి హీరోయిన్ అయ్యేంత అందంగా ఉన్న శ్రేయ సింగర్‌గా మాత్రమే పరిమితమవుతుందో లేక నటిగా కూడా ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Share post:

Popular