వామ్మో ప్రభాస్ చేతిలో 8 సినిమాలా.. మరి పెళ్లి సంగతేంటి..?

ప్రస్తుతం నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్ లో పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మరి కొన్ని రోజుల్లో మిగిలిన ఆరు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లను కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు.

ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా ఇప్పటికే మొదలుపెట్టాడు. ఇక తర్వాత మారుతి చిత్రాన్ని కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. ఇంకా అనౌన్స్ చేయని మూడు చిత్రాలు కూడా త్వరలోనే అధికారిక ప్రకటనకు సిద్ధంగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా ప్రభాస్ చేయవలసి ఉంది . ఆ తర్వాత సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇక ఆ తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో కూడా చారిత్రాత్మక సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ మరో ఆరు సంవత్సరాల పాటు ఖాళీగా లేనట్లు తెలుస్తోంది. ఇక వివాహం ఎప్పుడు చేసుకుంటాడని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ రెండు సినిమాలు అయిపోగానే చేసుకుంటారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు.

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇప్పట్లో వివాహం చేసుకునే లా కనిపించడం లేదు . ఇక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ లాగే ప్రభాస్ కూడా టాలీవుడ్ లో ఒంటరిగా మిగిలిపోతాడు అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి అయితే ఒంటరి జీవితాన్ని గడపడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Share post:

Popular