కొర‌టాల – ఎన్టీఆర్ ఫ్యీజులు ఎగిరిపోయే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వ‌స్తోన్న పాన్ ఇండియా సినిమా గురించి ఏ అప్‌డేట్ వ‌చ్చినా ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంది. త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకో శాటిస్‌పై కాలేదు. ఎప్పుడో నాలుగున్న‌రేళ్ల క్రితం వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ హిట్ అయినా సోలోగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేని సినిమా అయితే కాలేదు.

క‌ట్ చేస్తే క‌రోనా మూడు వేవ్‌ల త‌ర్వాత త్రిబుల్ ఆర్ వ‌చ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా బాహుబ‌లి రేంజ్ సినిమా కాద‌న్న ముద్ర ప‌డిపోయింది. పైగా సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఉండ‌డం.. చాలా మంది రామ్‌చ‌ర‌ణ్ రోల్‌తో ఎన్టీఆర్ భీం రోల్ కంపేరిజ‌న్ చేసుకుని ఎక్క‌డో అసంతృప్తితో ఉండ‌డం ఇవ‌న్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అయితే కాలేదు.

అందుకే ఇప్పుడు కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ సినిమాల‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ముందుగా కొర‌టాల శివ కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమాపై ఓ అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంట‌ర్వెల్లో వ‌చ్చే సెట్ బ్లాస్ట్ సీన్‌లో ఎన్టీఆర్ యాక్షన్ అదరిపోతుందట. తారక్ ను గతంలో ఎన్నడూ ఈ స్థాయి యాక్షన్ మోడ్ లో చూడలేదట.

ఇంట‌ర్వెల్‌కు ముందు స‌ముద్రంలో జ‌రిగే ఓ భారీ ఫైట్ సీన్ ఉంటుంద‌ట‌. ఆ త‌ర్వాత అక్క‌డే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంద‌ని అంటున్నారు. ఆగ‌స్టు నుంచి సెట్స్ మీద‌కు వెళ్లే ఈ సినిమా కోసం తార‌క్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నారు. ఈ సినిమా కోసం 8-9 కిలోల బరువు తగ్గనున్నాడు తారక్.

Share post:

Popular