సడన్‌గా ప్లాన్ మార్చిన కొరటాల శివ.. ఎన్టీఆర్ 30 మూవీని అలా తీస్తాడట..!

మిర్చి, శ్రీమంతుడు అనే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు తీసి తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. మొన్నీమధ్య తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా ఒక మెసేజ్ అందించాడు. అయితే ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి కానీ ఆచార్య బోల్తా కొట్టింది. ఈ సినిమా ఊహించని రీతిలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో కొరటాల శివ తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తారక్‌తో కలిసి తీస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై ఆయన దృష్టి సారించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఎన్టీఆర్ 30వ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను పలకరించనుంది. అనిరుద్ దీనికి సంగీత బాణీలు సమకూర్చనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న థీమ్ వీడియో కూడా విడుదల చేశాడు. అయితే ఈ సినిమా ద్వారా కూడా ఒక మెసేజ్ అందించాలని కొరటాల శివ మొదట్లో అనుకున్నారట. కానీ ఆచార్య ప్లాప్ తర్వాత ఆయన తన మనసు మార్చుకున్నట్లు టాక్. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కమర్షియల్ మూవీతోనే హిట్ కొట్టడం గ్యారెంటీ అనే కాన్సెప్ట్ తో కొరటాల ముందు అడుగులు వేస్తున్నట్లు బోగట్టా. అలా కాకుండా ఎప్పట్లాగే సందేశాత్మక చిత్రం తీస్తే అది కాస్త రిస్క్ అని చెప్పచ్చు. ఆచార్య తర్వాత మళ్ళీ ఇంకొక అట్టర్ ఫ్లాప్ వస్తే.. అతని కెరీర్ తలకిందులు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎన్టీఆర్ 30 మూవీ ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా, ఈ మూవీలో హై ఓల్టేజ్ సీక్వెన్స్‌లలో తారక్ రౌద్రావతారంలో కనిపించి అదరగొట్టనున్నాడు.

Share post:

Popular