చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తే.. పెళ్లి సెట్ అయినట్లే.. కొత్త సెంటిమెంట్?

ఎప్పుడూ సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో వైరల్ మారిపోతూనే ఉంటుంది. ఇక ఇలాంటి వార్తలు ఎంతోమందిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిన వార్త ఏంటి అనుకుంటున్నారూ కదా. మెగాస్టార్ చిరంజీవి గురించి.. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి సరసనా హీరోయిన్గా నటించింది లేదో వెంటనే హీరోయిన్లకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. అదేంటి ఇదేదో కాస్త విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.

ఇక పూర్తిగా వార్త చదివిన తర్వాత మాత్రం మీకు ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. మెగాస్టార్ రి ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరి ప్రేమకు ప్రతిరూపంగా బాబు కూడా పుట్టాడు. ఇక సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార, తమన్నా కూడా చిరంజీవి సరసన హీరోయిన్ లుగా నటించారు. ఇక ఇప్పుడు లూసీఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలోనూ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్. ఇక నయనతార మరికొన్ని రోజుల్లో తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో పెళ్లికి రెడీ అయిపోయింది.

ఇక ఇప్పుడు చిరు సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తోంది. సైరా సినిమాలో నటించిన తమన్నా ఇప్పుడు బోలా శంకర్ సినిమా లో హీరో పక్కన నటిస్తోంది. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ కీ కూడా త్వరలో పెళ్లి కాబోతుంది ఏమో అన్న చర్చలు నడుస్తున్నాయి. తమన్నా వయస్సు కూడా మూడు పదులు దాటిపోయింది. దీంతో ఇక తమన్నా కూడా మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంది అన్న చర్చ జరుగుతుంది. ఇలా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తే చాలు పెళ్లి సెట్ అయిపోతుందని ఒక సెంటిమెంట్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది..

Share post:

Popular