రష్ చూడగానే డైరెక్టర్ ని మార్చేసిన టాలీవుడ్ హీరో !

ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కుర్రహీరో కిరణ్ అబ్బవరం. ఇక రెండవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ వారసురాలు కోడి దివ్య నిర్మాణంలో “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అనే సినిమా తెరకెక్కుతోంది. అసలు విషయంలోకి వెళితే మొన్నటి వరకు ఈ సినిమాకి దర్శకుడు కార్తిక్ శంకర్ పనిచేశాడు. ఉన్నట్టుండి ఈ సినిమా దర్శకుడిని మార్చడం జరిగింది. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ఇటీవల రివ్యూ చూసుకున్నాక సినిమా రిజల్ట్ క్లియర్ గా కనిపించడంతో ఉన్నఫలంగా దర్శకుడిని మార్చేశారు.

ఇక ఈ హీరో కూడా తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీధర్ పేరు సజెస్ట్ చేయడంతో రాత్రికి రాత్రే పోస్టర్ మీద ఆ దర్శకుడి పేరు మారిపోయింది. ఇక కథ మాత్రం దర్శకుడు కార్తీక్ దే అయినా.. అతనికి రావాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చి.. పక్కకు పెట్టేశారు. ఇప్పుడు మరొక దర్శకుడుతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. అయితే నిర్మాత కోడి దివ్య ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా స్ట్రాంగ్ రీజన్ ఉన్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే నేను మీకు బాగా కావలసిన వాడిని అనే సినిమా తన బ్యానర్ కి మొదటి సినిమా కావడం గమనార్హం.

పైగా పోస్టర్ పై కోడి రామకృష్ణ సమర్పణ అని తన తండ్రి పేరును కూడా వేస్తున్నారు. ఇక మొదటి సినిమా తేడా వస్తే తండ్రి పేరు చెడగొట్టినట్లు అవుతుంది .అందుకే మొదటి సినిమా రిజల్ట్ కూడా అనుకున్న విధంగా రాకపోతే ప్రొడక్షన్ విభాగంలో నెక్స్ట్ సినిమా కష్టమవుతుంది. అందుకే కార్తీక్ తీసిన రష్ చూసి ఈ నిర్ణయం తీసుకున్నారు కోడి దివ్య. ఈ విషయానికి హీరో కూడా ఊ కొట్టి తనకు సింక్ అయిన దర్శకుడిని రంగంలోకి దింపాడు.పైగా దర్శకుడు కూడా హీరోతో ఆల్రెడీ హిట్ కొట్టడంతో వీరి మార్కెటింగ్ మరింత ఈజీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక కుర్ర హీరోలు ఇటీవల కాలంలో హిట్టు పడితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.

Share post:

Popular