నాని “ అంటే సుందరానికీ ” ఫస్ట్ వీక్ కలెక్షన్లు… నానికి మ‌ళ్లీ బిగ్ షాక్‌..!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన అంటే సుంద‌రానికి సినిమా గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మంచి టాకే వ‌చ్చింది. అయితే లెన్త్ ఎక్కువుగా ఉంద‌ని.. స్లో నెరేష‌న్ అని.. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే న‌చ్చుతుంద‌న్న కంప్లైంట్లు ముందు నుంచి ఉన్నాయి.

అయినా ఈ సినిమా మేక‌ర్స్ మాత్రం ర‌న్ టైం త‌గ్గించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి వరల్డ్‌వైడ్‌గా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టగా, రూ.32.60 కోట్లు గ్రాస్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే రు. 30 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టాలి.

ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో ఈ సినిమా క‌లెక్ష‌న్లు డ‌ల్ అయిపోయాయి. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్పా ఈ సినిమా హిట్ అయ్యే అవ‌కాశాలు లేవు. ఏదేమైనా వి – ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో నిరాశ‌ప‌ర‌చ‌గా… శ్యామ్‌సింగ రాయ క‌లెక్ష‌న్ల ప‌రంగా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు అంటే సుంద‌రానికి సినిమాతో నానికి మ‌రో షాక్ అని చెప్పాలి.

నైజాం – రూ.5.58 కోట్లు

సీడెడ్‌ – రూ.1.13 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.1.33 కోట్లు

ఈస్ట్‌ – రూ.0.93 కోట్లు

వెస్ట్‌ – రూ.0.79 కోట్లు

గుంటూరు – రూ.0.87 కోట్లు

కృష్ణా – రూ.0.84 కోట్లు

నెల్లూరు – రూ.0.58 కోట్లు
—————————————-
ఏపీ + తెలంగాణ = రూ.12.05 కోట్లు (రూ.20.40 కోట్లు గ్రాస్‌)

కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా – రూ.1.34 కోట్లు

ఓవర్సీస్‌ – 5 కోట్లు
————————————————————————–
ప్రపంచవ్యాప్తంగా – రూ.18.39 కోట్లు (రూ.32.60 కోట్లు గ్రాస్‌)
—————————————————————————

Share post:

Popular